Begin typing your search above and press return to search.

ఆఫీస్కు సన్నీ లియోన్.. ఫొటోలో అసభ్యకరంగా..

బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి అందరికీ తెలిసిందే. తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులారిటీ సొంతమైంది.

By:  M Prashanth   |   16 Aug 2025 12:22 PM IST
ఆఫీస్కు సన్నీ లియోన్.. ఫొటోలో అసభ్యకరంగా..
X

బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి అందరికీ తెలిసిందే. తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులారిటీ సొంతమైంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మోడలింగ్ చేసిన ఆమె.. ఆ తర్వాత సినిమాలకు పరిమితమైంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్న బ్యూటీ.. పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. తన అందచందాలతో మెప్పిస్తుంది.

ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ లో నటించి పాపులర్ అయిన ముద్దుగుమ్మ.. తెలుగులో కూడా సందడి చేసింది. ఇప్పటికే పలు సాంగ్స్ లో కనిపించి ఆకట్టుకుంది. కరెంట్ తీగ, గరుడ వేగ వంటి పలు సినిమాలతో మెప్పించిన అమ్మడు.. ఇప్పుడు త్రిముఖలో మరో ఐటెం సాంగ్ లో కనపడనుంది సన్నీలియోన్. సాహితీ దాసరి, ఆకృతి అగర్వాల్ తో కలిసి గిప్పా గిప్పా పాటలో కనువిందు చేయనుండడం పక్కా.

మొత్తానికి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ వాలిపోతూ సక్సెస్ అందుకుంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా సన్నీ లియోన్ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ పోస్ట్ చేస్తూ.. తన అంద చందాలు ఆరబోస్తూ.. సందడి చేస్తుంటుంది. క్రేజీ ఔట్ ఫిట్స్ వేసుకుంటూ గ్లామర్ తో మైమరిపించడం సన్నీకి వెన్నతో పెట్టిన విద్య అనుకోవాలి.

సన్నీ లియోన్ కు తన ఫ్యాషన్ ఎంపికలతో అందరి దృష్టి ఎలా ఆకర్షించాలో బాగా తెలుసని చెప్పాలి. ఆమె కేవలం గ్లిట్జ్, గ్లామర్ తోనే కాకుండా.. తన బబ్లీ నెస్, వినయపూర్వకమైన వ్యక్తిత్వంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. అయితే తాజాగా వీడియో పోస్ట్ చేసింది. ఈరోజు ఆఫీసులోకి అడుగుపెట్టినప్పుడు చూసిన దాన్ని మీరు నమ్మలేరంటూ రాసుకొచ్చింది.

ఆ వీడియోలో ఆమె ఆఫీస్ కు వెళ్తుండగా.. ఎడిటర్ ఓ ఫోటోను ఎడిట్ చేస్తుంటారు. పిక్ ను జూమ్ చేసి చూస్తుంటారు. ఆ సమయంలో వెనక నుంచి వీడియో తీసి పోస్ట్ చేసింది సన్నీ లియోన్. ఎవరూ దాన్ని నమ్మలేరని తెలిపింది. షాక్ అయినట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు, అభిమానులు తెగ రెస్పాండ్ అవుతున్నారు. రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.