అద్దె గర్భం పిల్లల పెంపకంపై సన్నీలియోన్
తనకు పిల్లల్ని కనడం ఇష్టం లేకపోవడంతోనే అద్దె గర్భా(సరోగసి)న్ని ఆశ్రయించామని చెప్పారు సన్నీలియోన్.
By: Sivaji Kontham | 30 Aug 2025 9:35 AM ISTతనకు పిల్లల్ని కనడం ఇష్టం లేకపోవడంతోనే అద్దె గర్భా(సరోగసి)న్ని ఆశ్రయించామని చెప్పారు సన్నీలియోన్. పిల్లల్ని దత్తత తీసుకోవడం, అద్దె గర్భంలో పిల్లల్ని కనడం, పిల్లల పెంపకంలో నిజాయితీ- నిబద్ధత- ప్రేమ గురించి సన్నీలియోన్ చెప్పిన విషయాలు హృదయాలను గెలుచుకుంటున్నాయి.
తాను మొదటి బిడ్డను దత్తత తీసుకున్నానని చెప్పిన సన్నీలియోన్, అదే రోజు ఐవిఎఫ్- సరోగసీ ద్వారా పిల్లల్ని కనేందుకు దరఖాస్తు చేసుకున్నామని కూడా వెల్లడించారు. సరోగసీలో మాకు కవలలు జన్మించారు. పిల్లలకు తల్లి కావడం అనేది ఎమోషనల్ కనెక్టివిటీ. పిల్లల్ని పెంచడంలో ఇబ్బందులు, ఖర్చుల గురించి సన్నీలియోన్ ఈ ఇంటర్వ్యూలో ఎంతో నిజాయితీగా మాట్లాడారు.
పిల్లల్ని పెంచడం అనేది గొప్ప బాధ్యత. సరోగసీ అనేది కేవలం చట్టపరమైన ప్రక్రియ కాదు.. బిడ్డతో తల్లి భావోద్వేగానికి సంబంధించినది. దత్తత ద్వారా వేరొకరి బిడ్డను చూసుకోవడం కూడా ఎంతో బాధ్యత ఉద్వేగంతో కూడుకున్నది అని సన్నీలియోన్ అన్నారు.
అంతేకాదు సన్నీలియోన్ తనకు ఎన్ని ఇతర పనులు ఉన్నా తన కుటుంబానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. బిడ్డను కంటే సరిపోదు.. చాలా కృషి, ప్రేమ ఉన్నప్పుడే పిల్లలను సవ్యంగా పెంచగలమని కూడా సన్నీలియోన్ అన్నారు. పిల్లల విషయంలో ప్రేమ, సంరక్షణ, నిబద్ధత చాలా చాలా అవసరం అని అన్నారు.
మొత్తానికి శృం*గార తారగా తన గతం నుంచి బయటపడిన సన్నీలియోన్, స్నేహితుడు డేనియల్ వెబర్ ని పెళ్లాడి, ఆ తర్వాత ఒక కిడ్ ని దత్తత తీసుకుని, సరోగసీలో కవలలకు జన్మనిచ్చి ఇప్పుడు వారి బాధ్యతల్ని స్వీకరించి తల్లిగా ఎంతో గొప్ప ఉన్నతిని అందుకున్నారు. పిల్లల పెంపకంలో బాధ్యత, ప్రేమ గురించి సన్నీలియోన్ నిజాయితీతో కూడిన మాటలు అందరి హృదయాలను గెలుచుకుంటున్నాయి.
