ఆ ప్రముఖుడి పేరు లీక్ చేయకుండా దాస్తున్న సన్నీలియోన్
శృంగార తారగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న సన్నీలియోన్ ఇప్పుడు పూర్తిగా ఆ ప్రపంచానికి దూరమైన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 20 Sept 2025 5:00 PM ISTశృంగార తారగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న సన్నీలియోన్ ఇప్పుడు పూర్తిగా ఆ ప్రపంచానికి దూరమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తన కెరీర్ ని నిర్మించుకునేందుకు ఈ భామ తపించింది. దీనికి తన భర్త డేనియల్ వెబర్ పూర్తి సహకారం అందించారు. సన్నీలియోన్ ఇప్పటికే చార్ట్ బస్టర్ సింగిల్ ఆల్బమ్స్ లో నర్తించడమే గాక, బాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ సహా సౌత్ లోను సన్నీలియోన్ మెరుపుల గురించి తెలిసిందే. మంచు మనోజ్ `కరెంట్ తీగ` చిత్రంలోను సన్నీలియోన్ కీలక పాత్రలో నటించింది. సన్నీ మేని విరుపులకు తెలుగు యువత ఫిదా అయిపోయింది.
అయితే ప్రత్యేక గీతాల స్పెషలిస్టుగా, నటిగాను పాపులరైన సన్నీలియోన్ అనూహ్యంగా తన కిడ్స్ కోసం బిగ్ బ్రేక్ కూడా తీసుకుంది. దత్తత తీసుకున్న చిన్నారితో పాటు సరోగసీలో జన్మించిన పిల్లల కోసం సన్నీలియోన్ మాతృమూర్తిగా బాధ్యతలు చేపట్టింది. తన జీవితంలో కీలక సమయాన్ని పిల్లల పెంపకం కోసం కేటాయించింది. తద్వారా మాతృత్వంలోని ఆనందాన్ని ఆస్వాధిస్తోంది.
సన్నీలియోన్ ఇంతకుముందే వ్యవస్థాపకురాలిగాను మారింది. స్టార్ స్టక్ పేరుతో సౌందర్య ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశించింది. ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగుతోంది. మరోవైపు సన్నీలియోన్ సొంత బ్యానర్ ప్రారంభించి, అందులో సినిమాలను కూడా నిర్మిస్తోంది. ప్రస్తుతం సినీ నిర్మాతగా విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించే బయోపిక్ సిరీస్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి స్థాపించబడిన సన్‌సిటీ బ్యానర్ నిర్మిస్తుంది. విక్రమాదిత్య మోత్వానే సహ నిర్మాతగా వ్యవహరిస్తారు.
ఒక అద్భుతమైన జీవితకథను వెబ్ సిరీస్ గా అందించడం ఉత్సాహం పెంచుతోందని సన్నీలియోన్ ఆనందం వ్యక్తం చేస్తోంది. నిజ ఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ని రూపొందిస్తుండడంతో మోత్వానీ లాంటి సీనియర్ దర్శకుడు దీనిని ఉత్కంఠగా ఓటీటీ తెరపై చూపించగలరని సన్నీ నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే తాను నిర్మించే వెబ్ సిరీస్ ఎవరి జీవితం ఆధారంగానో ఇంకా చెప్పలేదు. ఆ ప్రముఖుడి పేరును కనీసం రివీల్ చేయకుండా సన్నీ దాచేస్తోంది. అయితే బయోపిక్ కేటగిరీలో వెబ్ సిరీస్ అనగానే అందరిలో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఆ రకంగా హైప్ పెంచాలనే ప్రయత్నం సఫలమవ్వాలంటే ప్రతి సన్నివేశం ఉత్కంఠను కలిగించేలా, గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లేని ఎలివేట్ చేయడంలో మోత్వానీ పనితనం ప్రదర్శించాల్సి ఉంటుంది. వెబ్ సిరీస్ లకు ప్రపంచవ్యాప్తంగా రీచ్ ఉంటుంది గనుక నిర్మాతగా సన్నీలియోన్ పేరు, దర్శకుడిగా మోత్వానీ పేరు మార్మోగడం ఖాయం.
