ఫోటో స్టోరీ: మిడ్డీలో సన్నీలియోన్ 'డాపర్ లేడీ' లుక్
కళ్లకు స్టైలిష్ గాగుల్స్.. కాళ్లకు హైహీల్డ్ బూట్లు.. పిక్కల పైకి ఉన్న మిడ్డీ డ్రెస్సులో జిప్సీ మీద అరేబియన్ గుర్రంలా మెరిసిపోతోంది బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్.
By: Sivaji Kontham | 10 May 2026 1:00 AM ISTకళ్లకు స్టైలిష్ గాగుల్స్.. కాళ్లకు హైహీల్డ్ బూట్లు.. పిక్కల పైకి ఉన్న మిడ్డీ డ్రెస్సులో జిప్సీ మీద అరేబియన్ గుర్రంలా మెరిసిపోతోంది బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్. తనదైన వయ్యారంతో.. కవ్విస్తున్న చూపులతో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తున్న ఈ భామ పరిచయం అస్సలు అవసరం లేదు. తాజాగా సన్నీ షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో ఒక రేంజ్ లో వైరల్ అవుతూ `దుమారం` రేపుతున్నాయి.
తనదైన అందం, ఆహార్యం.. అద్భుతమైన డాన్సింగ్ టాలెంట్‌తో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లను ఒక ఊపు ఊపేసింది ఈ భామ. తెలుగులో మంచు మనోజ్ నటించిన `కరెంట్ తీగ`చిత్రంలో టీచరమ్మ పాత్రలో నటించి తన గ్లామర్‌తో పాటు నటనతోనూ మైమరిపించింది. కేవలం ఐటెం సాంగ్స్‌కే పరిమితం కాకుండా.. కీలక పాత్రల్లోనూ మెప్పిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
ప్రస్తుతం సన్నీలియోన్ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య చక్కని సమతుల్యత పాటిస్తోంది. ఎక్కువగా భర్త - పిల్లలతో గడుపుతూనే తన సొంత సౌందర్య ఉత్పత్తుల కంపెనీని - స్టార్ స్టక్ ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. అప్పుడప్పుడు సినిమాలు.. రెగ్యులర్ టీవీ రియాలిటీ షోలు.. వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగానే ఆదాయాన్ని ఆర్జిస్తూ బిజీగా గడుపుతోంది.
తాజాగా `లెట్స్ గో ఫర్ ఏ డ్రైవ్` అంటూ `ది డాపర్ లేడీ` ఔట్ ఫిట్‌లో అదిరిపోయే ఫోజులిచ్చింది సన్నీ. స్వరోవ్‌స్కీ గ్లాసెస్, సెయింట్ జీ వరల్డ్ షూస్‌తో సన్నీ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్‌లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోషూట్ చూసిన నెటిజన్లు `ఫ్లా లెస్ క్వీన్` అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో తన స్థానం ఎప్పటికీ పదిలమని ది గ్రేట్ సన్నీ మరోసారి నిరూపించుకుంది.
సన్నీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో `స్ప్లిట్స్‌విల్లా X6` ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో `ప్యార్ కా పవర్` చూపించమని తను కోరడం అభిమానుల్లో ఉత్కంఠను పెంచింది. ఈ సీజన్ ఫినాలేలో ఊహించని ట్విస్టులు ఉంటాయని... వ్యూహాల కంటే ప్రేమే గెలుస్తుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.
గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న సన్నీలియోన్ ఇప్పుడు వ్యాపారవేత్తగా.. రియాలిటీ షో హోస్ట్‌గా తన కెరీర్‌ను విజయవంతంగా మలుచుకోవడంలో తను చూపిన అంకితభావం ఇతర నటీమణులకు ఒక ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
