సముద్రుడికే చెమటలు పట్టిస్తున్న సన్నీ లియోన్!
ఈ ఫోటోలో షిప్ లో సముద్రం మధ్యలో సన్నీలియోన్ పింక్ కలర్ బికినీలో అందాలు చూపిస్తూ తెగ సందడి చేసింది.
By: Madhu Reddy | 5 Nov 2025 1:26 PM ISTబాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ లో సన్నీ లియోన్ అనే పేరు తెలియని వారు ఉండరు. ఈ ముద్దుగుమ్మ తన బోల్డ్ అందాలతో ఎంతోమందికి దగ్గరైపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా సముద్రంలో గ్లామర్ లుక్ ఇస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా సన్నీలియోన్ సముద్రంలో షిప్ లో వెళ్తున్న కొన్ని ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో షిప్ లో సముద్రం మధ్యలో సన్నీలియోన్ పింక్ కలర్ బికినీలో అందాలు చూపిస్తూ తెగ సందడి చేసింది. ప్రస్తుతం సన్నీ లియోన్ షేర్ చేసిన ఈ ఫోటోలను చూసిన చాలామంది జనాలు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.
సన్నీ లియోన్ అందానికి మేమంతా దాసులమైపోయాం అంటూ ఫైర్ ఏమోజీస్ ని పెడుతున్నారు.. అయితే సన్నీలియోన్ నుండి ఇలాంటి ఫోటోలు ఎక్స్పెక్ట్ చేయడం మామూలే..ఎందుకంటే తరచూ ఇలాంటి ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడుతోంది ఈ ముద్దుగుమ్మ.
సన్నీలియోన్ విషయానికి వస్తే.. ఈమె ఇండియాకి చెందిన అమ్మాయే.. సన్నీ లియోన్ తండ్రి టిబెట్ లో పుట్టి ఢిల్లీలో పెరిగగా.. తల్లి హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పెరిగింది. అలా వీరి పెళ్లయ్యాక ఇండియా వదిలేసి కెనడాలో వెళ్లి స్థిరపడ్డారు. అలా సన్నీ లియోన్ ఇండియన్ నటి అయినప్పటికీ కెనడాలో పుట్టి పెరగడం వల్ల చాలామంది కెనడానే అనుకుంటారు. ఇక సన్నీలియోన్ అసలు పేరు కరణ్ మల్హోత్రా. కానీ ఆ తర్వాత పేరు మార్చుకుంది.
చిన్నప్పటి నుండి ఎంతో ఫ్రీడమ్ గా పెరిగిన సన్నిలియోన్ డాన్స్ చేయడం, పాటలు పాడడం ఇలా చిన్నతనంలో ఎన్నో చేసేది. అలా 11 ఏళ్ల వయసులోనే సన్నిలియోన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మొదటి ముద్దు ఎక్స్పీరియన్స్ చేసింది. ఇక టీనేజ్లోకి వచ్చాక మోడలింగ్ రంగంలో రాణించాలనుకుంది. కానీ 1999లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్స్ గా శిక్షణ తీసుకుంది. 2011లో హిందీ బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ గా వెళ్లి బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక సన్నీలియోన్ మొదటి హిందీ మూవీ జిస్మ్ 2.. ఈ సినిమాతోనే బాలీవుడ్ రంగంలోకి అడుగు పెట్టింది.
ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించిన సన్నీ లియోన్ టాలీవుడ్ లో కూడా సినిమా చేసింది. అదే కరెంటు తీగ.. మంచు మనోజ్,రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా వచ్చిన కరెంటు తీగ మూవీలో సన్నీ లియోన్ గెస్ట్ రోల్ పోషించింది. అలాగే రాజశేఖర్ హీరోగా నటించిన పిఎస్వి గరుడవేగ అనే సినిమాలో డియో డియో అనే ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇక మంచు విష్ణు, పాయల్ రాజ్పుత్ కాంబోలో వచ్చిన జిన్నా మూవీలో కూడా సన్నిలియోన్ గెస్ట్ రోల్ పోషించింది.
తెలుగులో సన్నిలియోన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ మందిర.. ఇందులో యోగి బాబు కూడా ప్రధాన పాత్రలో నటించారు. కానీ ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికి గుర్తులేదు. అలా తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ, హిందీ భాషల్లో నటిగా రాణించిన సన్నీలియోన్ తన అందాలతో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సన్నీలియోన్ సినిమాల్లో చిన్నాచితకా గెస్ట్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ వంటివి చేసినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ హీరోయిన్ కి లక్షలాదిమంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
