సన్నిలియోన్ ఇంటర్నేషనల్ క్రేజ్ ని అలా వాడుతున్నారా?
సన్నిలియోన్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ కంటేముందే మరో పరిశ్రమ ద్వారా అంతర్జాతీయంగా ఫేమస్.
By: Srikanth Kontham | 8 Sept 2025 1:02 AM ISTసన్నిలియోన్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ కంటేముందే మరో పరిశ్రమ ద్వారా అంతర్జాతీయంగా ఫేమస్. అదంతా ఆమె వ్యక్తిగతం అయినా బాలీవుడ్ ఆమె జీవన శైలినే మార్చేసింది. ఓ కొత్త ప్రపచంలో కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఇప్పుడా పాత క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే దిశగా మాస్టర్ ప్లాన్ వేసాడు దర్శక, నిర్మాత విక్రమాదిత్య మోత్వాని. సన్నిలియోన్ తో విక్రమ్ ఏకంగా ఓ ఇంటర్నే షనల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు.అదో బయోపిక్. ఈ బయోగ్రఫీని ఏకంగా సిరీస్ లు గా ప్రపంచం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇన్ స్పైరింగ్ బయోపిక్ లో:
ఇదోక ఇన్ స్పైరింగ్ బయోపిక్. ఈప్రాజెక్ట్ లోనే సన్నిలియోని నిర్మాతగానూ భాగస్వామిని చేసుకున్నారు. మొత్వానికి చెందిన ఆండలన్ పిల్మ్స్- సన్నీకి చెందిన సన్ సిటీ సంస్థలు సంయుక్తగా నిర్మిస్తున్నాయి. ఆ బయోపిక్ ఎవరిది? అన్నది రివీల్ చేయలేదు గానీ, ఇందులో నటిస్తున్నందకు సన్ని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇన్ స్పైరింగ్ బయోపిక్..ప్రాజెక్ట్ లో అసోసియేట్ అవుతున్నందుకు థ్రిల్లింగ్ గా ఉందంటూ ఓ పోస్ట్ పెట్టింది సన్నిలియోన్. ఇలాంటి అంతర్జాతీయ ప్రాజెక్ట్ లు సన్నిలియోన్ కు కొత్తేం కాదు.
పదేళ్ల తర్వాత మళ్లీ:
అయితే అవన్నీ తాను కెరీర్ ఆరంభంలో చేసినవే. అవి గెస్ట్ అపీరియన్స్ లు మాత్రమే. `పైరెట్స్ బ్లడ్`, `వర్జినిటీ హిట్` లాంటి చిత్రాలు చేసినా ఆ రెండు బాలీవుడ్ కి రాకముందు చేసినవి. బాలీవుడ్ కి వచ్చిన తర్వాత అమ్మడి క్రేజ్ రెట్టింపు అయింది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. `జిస్మ్ 2` తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తర్వాత `మోస్ట్ లీ సన్ని` అనే ఓ డాక్యుమెంటరీ ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా చేసింది. అదీ పదేళ్ల క్రితం. ఆ తర్వాత మళ్లీ సన్ని అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇది కూడా ఆమెకు అంతర్జాతీయంగా అంత గుర్తింపు తీసుకురాలేదు.
సన్ని కి దూరంగా టాలీవుడ్:
మళ్లీ ఇంత కాలానికి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయడం విశేషం. అందులో నూ బయోపిక్ కావడంతో? ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. ఈ బయోపిక్ కూడా సన్ని వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుందనే సమాచారం ఉంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. ప్రస్తుతం సన్నిలియోన్ బాలీవుడ్ సహా సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళం, మలయాళం చిత్రాల్లో అవకాశాలు అందుకుంటుంది. ఓ తెలుగు సినిమా లో కూడా గెస్ట్ అపిరియన్స్ ఇచ్చింది. అయితే టాలీవుడ్ లో సన్నిలియోన్ ట్యాలెంట్ ని పెద్దగా వినియోగించుకోలేదు.
