Begin typing your search above and press return to search.

వార‌సుడు ఇండ‌స్ట్రీలో చాలా లెక్క‌లే స‌రి చేయాలి!

సునీల్ శెట్టి ఆ ఇమేజ్ నుండి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. సునీల్ శెట్టి తన కెరీర్‌లో చాలా వరకు మల్టీ-స్టారర్ సినిమాలే చేశారు.

By:  Srikanth Kontham   |   2 March 2026 12:00 AM IST
వార‌సుడు ఇండ‌స్ట్రీలో చాలా లెక్క‌లే స‌రి చేయాలి!
X

అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ , స‌ల్మాన్ ఖాన్ వంటి ఖాన్ త్రయంతో పోలిస్తే సునీల్ శెట్టి ఒక గొప్ప యాక్షన్ స్టార్‌గా ఎదిగినప్పటికీ వారి స్థాయిలో గ్లోబల్ మెగాస్టార్ కాలేక‌పోయాడు అన్న‌ది కాద‌న‌లేని నిజం. ఇది కేవ‌లం ప్ర‌తిభ స‌మస్యే కాదు. క‌థ‌ల ఎంపిక‌లు..అప్ప‌టి మార్కెట్ ప‌రిస్థితుల ప్ర‌భావం కూడా ఉంది. సునీల్ శెట్టి కెరీర్ ప్రారంభం నుండి యాక్షన్ హీరో గా బలమైన ముద్ర పడింది. 90వ దశకంలో యాక్షన్ సినిమాలకు మంచి ఆదరణ ఉన్నప్పటికీ, అవి ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయ్యాయి. అదే సమయంలో షారుక్ ఖాన్ రోమాంటిక్ హీరోగా ఫ్యామిలీస్ కి, అమీర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్ట్ గా క్లాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు.




సునీల్ శెట్టి ఆ ఇమేజ్ నుండి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. సునీల్ శెట్టి తన కెరీర్‌లో చాలా వరకు మల్టీ-స్టారర్ సినిమాలే చేశారు. 'బోర్డర్',' కాంటే', 'హేరా ఫేరి', 'ఆవారా' ,'పాగల్', 'దీవానా', 'మెయిన్ హూ నా' లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లే అయినప్పటికీ, క్రెడిట్ అంతా ఇతర నటులతో పంచుకోవాల్సి వచ్చింది. దీనివల్ల సోలో హీరోగా సునీల్ మార్కెట్ వాల్యూ ఖాన్ల స్థాయికి పెరగలేదు. అమీర్ ఖాన్ ఏడాదికి ఒక సినిమా చేసినా అది ట్రెండ్ సెట్టర్ అయ్యేలా చూసుకునేవారు. షారుక్ తన చుట్టూ ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్‌ను నిర్మించుకున్నారు. సునీల్ శెట్టి కొన్నిసార్లు స్క్రిప్ట్ కంటే స్నేహానికి, సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చి సాధారణ సినిమాలు చేశారు.

దీనివల్ల కొన్ని ప్లాపులు ఆయన కెరీర్ గ్రాఫ్‌ను ప్రభావితం చేశాయి. సునీల్ శెట్టిలోని నటుడు `ధడ్కన్ లో విలన్ రోల్, `హేరా ఫేరి` (కామెడీ) సినిమాలతోనే పూర్తిస్థాయిలో బయటకు వచ్చారు. అప్పటికే ఖాన్లు ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకున్నారు. సునీల్ తిరిగి త‌న‌ని తాను రీ-ఇన్వెంట్ చేసుకునే లోపే యంగ్ హీరోల నుంచి పోటీ పెరిగిపో యింది. అలా సునీల్ శెట్టి బాలీవుడ్ లో టాప్ స్టార్ల స‌ర‌స‌న చేర‌లేదు. అయితే ఇప్పుడీ లెక్క‌ల‌న్నింటిని సునీల్ శెట్టి వార‌సుడు ఆహాన్ శెట్టి స‌రిచేయాల్సిందే. తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

తొలి సినిమా 'త‌డ‌ప్' తో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మ‌ధ్య‌నే రిలీజ్ అయిన 'బోర్డ‌ర్ 2' తో రికార్డులే రాస్తున్నాడు. ఇటీవ‌లే రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ ను వ‌సూళ్ల‌తో షేక్ చేస్తోంది. మ‌రో రెండు రోజుల్లో చిత్రం 500 కోట్ల క్ల‌బ్లో చేరిపోతుంది. ఇదే జ‌రిగితే ఆహాన్ శెట్టి ఇమేజ్ రెండింత‌లు రెట్టింపు అవుతుంది. ప్ర‌స్తుతం 'సంకీ' అనే కాప్ స్టోరీలో న‌టిస్తున్నాడు. ఏసీపీ వీరేంద్ర పాత్ర‌లో అద‌ర గొట్ట‌బోతున్నాడు. అలాగే మ‌రికొన్ని యాక్ష‌న్ స్క్రిప్ట్ లు కూడా లాక్ చేసి పెట్టాడు.