Begin typing your search above and press return to search.

కంబ్యాక్ కోసం రెడీ అవుతున్న టైగర్.. ఈసారైనా హిట్ కొడ‌తాడా?

టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న కొత్త ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో మళ్లీ చర్చనీయాంశంగా మారుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   31 March 2026 8:00 PM IST
కంబ్యాక్ కోసం రెడీ అవుతున్న టైగర్.. ఈసారైనా హిట్ కొడ‌తాడా?
X

టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న కొత్త ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో మళ్లీ చర్చనీయాంశంగా మారుతోంది. నిర్మాత ముర‌ద్ ఖేతానీ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌పై షూట్ జరగనుండగా, టీమ్ ఫాస్ట్ ట్రాక్ ప్లానింగ్‌తో జూలై నాటికి షూటింగ్ ను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ మేకింగ్ స్కేల్, ప్రొడక్షన్ ప్లానింగ్ చూస్తే మేకర్స్‌లో ఉన్న కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ శెట్టి

ఇక ఈ ప్రాజెక్ట్‌కు తాజా బూస్ట్‌గా సునీల్ శెట్టి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఆయన ఎలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌నున్నార‌నే దానిపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ బ‌య‌ట‌కు రాక‌పోయినా, కథలో కీలక మలుపు తీసుకొచ్చే క్యారెక్టర్‌గా ఉండొచ్చ‌ని అంద‌రూ భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న చర్చల్లో ప్రధానంగా వినిపిస్తున్న అంశం టైగ‌ర్ ష్రాఫ్ రెమ్యూన‌రేష‌న్. ఆయ‌న ఒక్కో సినిమాకు సుమారు రూ. 40 కోట్లు తీసుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆయన సినిమాల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల, ఈ భారీ పారితోషికం ప్రొడక్షన్‌పై అదనపు ఒత్తిడిని పెంచుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పెట్టుబడిపై రిటర్న్స్ ఎలా ఉంటాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

కొన్ని సినిమాలుగా ఓపెనింగ్స్ తెచ్చుకోలేక‌పోతున్న టైగ‌ర్

బాక్సాఫీస్ పరంగా చూసుకుంటే, పోస్ట్ పాండమిక్ కాలంలో యాక్షన్ జానర్‌లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. టైగ‌ర్ ష్రాఫ్ గత సినిమాలు ఓపెనింగ్స్ క‌లెక్ష‌న్ల‌లో తగ్గుదల చూపించాయి. ఈ నేప‌థ్యంలో కేవలం యాక్షన్ ఎలిమెంట్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమైందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కంటెంట్, కథనంలో కొత్తదనం అవసరమనే డిమాండ్ కూడా ఇప్పుడు ఆడియ‌న్స్ లో పెరిగింది.

ఈ నేపథ్యంలో, ఈ సినిమా టైగర్‌కు కంబ్యాక్ మారుతుందా అన్నది ప్ర‌శ్న‌గా మారింది. సరైన స్క్రిప్ట్ సెలెక్షన్, బలమైన నెరేషన్ ఉంటే కెరీర్‌లో మరో టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. అదే సమయంలో, గతంలో స్క్రిప్ట్ ఎంపికపై వచ్చిన విమర్శలు కూడా ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఫోకస్ తెచ్చాయి. డిసెంబర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమా హాలిడే సీజన్‌ను క్యాష్ చేసుకునే స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ ప్రకారం పూర్తయితే, మార్కెట్‌లో మంచి విండో దక్కే అవకాశముంది. అయితే ఏ చిన్న ఆలస్యం జరిగినా రిలీజ్ ప్లాన్ మారే అవకాశం ఉంది.