హాట్ సింగర్ పై ఇలాంటి పనులు తగునా?
బాలీవుడ్ హాట్ సింగర్ సునీది చౌహాన్ గురించి పరిచయం అవసరం లేదు. తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది.
By: Srikanth Kontham | 31 Dec 2025 7:26 PM ISTబాలీవుడ్ హాట్ సింగర్ సునీది చౌహాన్ గురించి పరిచయం అవసరం లేదు. తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. అమ్మడు మైక్ చేత పట్టి గొంతు సవరించిందంటే? కుర్రాళ్లలో పూనకాలు లోడ్ అవ్వాల్సిందే. బోల్డ్ ఓకల్ రేంజ్ తో యువత గుండెల్లో గునపాలు దించడం సునీది చౌహాన్ ప్రత్యేకత. తనదైన పవర్‌హౌస్ ప్రదర్శన తో సెగలు పుట్టిస్తుంది. ఎలాంటి వేదికైనా రక్తి కట్టించడంలో తానో స్పెషలిస్ట్. ఎక్కడ షో చేసినా? అది నెట్టింట వైరల్ అవ్వాల్సిందే.
సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండింగ్ లో నిలిచిన బ్యూటీ. వైరల్ పెర్పార్మర్ గానూ పేరుంది. అయితే సునీది చౌహాన్ పై విమర్శలు ఎప్పటికప్పుడు అదే స్థాయిలో వ్యక్తమవుతుంటాయి. సోషల్ మీడియలో ట్రోల్ అయిన సందర్బాలెన్నో. ఆమె యాంటీ ఫ్యాన్స్, ఇనెసెల్స్ నుంచి నిత్యం ఈ తరహా విమర్శలు పరిపాటే. తాజాగాఆమెను టార్గెట్ గా చేసుకుని సునీది ప్రదర్శనలు మరీ బోల్డ్‌గా ఉన్నాయంటూ ట్రోలింగ్ జరుగుతోంది.
ఓలైవ్ ఈవెంట్ లో అలరించిన అమ్మడు మరోసారి ట్రోలర్లకు దొరికిపోయింది. చిట్టి పొట్టి దుస్తుల్లో సునీది బోల్డ్ పెర్పార్మెన్స్ పై రకరకాల కామెంట్లు పడుతున్నాయి. ఆమె వయసును గుర్తు చేస్తూ ఎగతాళి చేస్తున్నారు. మరికొం దరు ఆమెను నేహా కక్కర్‌తో పోలుస్తున్నారు. ఇంకొందరైతే వెస్ట్రన్ సింగర్స్ నిక్కీ మినాజ్ లేదా కార్డి బిలను అను కరించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై సునీధి అభిమానులు అంతే ధీటుగా
బధులిస్తున్నారు.
సునీది చౌహాన్ వోకల్ రేంజ్ కి ఎవరూ సాటిలేరంటున్నారు. నిక్కీ మినాజ్ లేదా కార్డి బి వంటి వారు కూడా సునీద్ సామర్ధ్యం ముందు ఎంత? అంటున్నారు. ఇలాంటి వాటిని సునీది పట్టించుకోకుండా కళాత్మకతకే ప్రాధాన్యత ఇవ్వాలని మద్దతుదారులంతా కోరుతున్నారు. ఈ చర్చలోకి నేహా కక్కర్‌ను లాగడాన్ని కూడా చాలా మంది తప్పుబడుతున్నారు. ఒక సింగర్ ని సమర్ధించే క్రమంలో మరో మహిళను కించ పరచడం సరికాదని అభిప్రా యపడుతున్నారు. ఇలాంటి వాటిపై ఎలాంటి చర్చకు దారి తీసినా? అది ఎంతో హుందాగా ఉండాలంటూ సునీది చౌహాన్ ఫాలోవర్లు కోరుతున్నారు. మరి ఈ విమర్శలు..ట్రోలింగ్ ఇప్పటికైనా ఆగుతుందేమో చూద్దాం.
