ఈ హీరోలు రచ్చ గెలుస్తారా?
తెలుగులో తనకంటూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాక తమిళంలోకి అడుగుపెట్టాడు సందీప్ కిషన్.
By: Garuda Media | 30 Sept 2026 6:47 PM ISTతెలుగులో తనకంటూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాక తమిళంలోకి అడుగుపెట్టాడు సందీప్ కిషన్. మానగరం, మాయవన్ లాంటి చిత్రాలు అతడికి మంచి గుర్తింపునే తెచ్చిపెట్టాయి. ఐతే అక్కడ పెద్ద కమర్షియల్ సక్సెస్ కోంస అతను ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి టైంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో ‘సిగ్మా’ మూవీ చేశాడు. కొన్ని నెలల ముందే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడి గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2న రిలీజ్ కానుంది.
ఇదే రోజు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ మూవీతో ఫాహద్ ఫాజిల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మలయాళంలో ఫాహద్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నటుడిగా అతడి స్థాయే వేరు. తెలుగులో కూడా ఫాహద్‌కు మంచి ఫాలోయింగే ఉంది. ‘పుష్ప’తో మంచి పాపులారిటీ సంపాదించాడు. ఇప్పుడు ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’తో హీరోగా తెలుగులోకి అడుగుపెడుతున్నాడు.
అటు సందీప్, ఇటు ఫాహద్ రచ్చగెలుస్తారా అన్నది ఆసక్తికరం. ఇవే సినిమాలతో ఇద్దరు పెద్ద వ్యక్తుల పిల్లల భవితవ్యం కూడా ముడిపడి ఉంది. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ను నిర్మించింది రాజమౌళి తనయుడు కార్తికేయ. అతను ఇంతకుముందు కూడా కొన్ని సినిమాల ప్రొడక్షన్లో భాగమైనప్పటికీ.. నిర్మాతగా ఇదే తొలి పూర్తి స్థాయి చిత్రం. ఇక ‘సిగ్మా’ మూవీ తీసిందేమో తమిళనాడు సీఎం కొడుకు. మరి ఈ ఇద్దరు వారసులు తండ్రుల పేర్లు నిలబెట్టే స్థాయిలో విజయం అందుకుంటారా అన్నది కూడా ఆసక్తికరమే.
