సందీప్ కిషన్ సూపర్ సుబ్బు రిలీజ్ డేట్ లాక్.. ఫస్ట్ ఎవర్ తెలుగు ఒరిజినల్ ఫిలింగా!
భాషతో సంబంధం లేకుండా అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 15 Jun 2026 1:05 PM ISTభాషతో సంబంధం లేకుండా అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఈయన.. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమాలతోనే కాదు వెబ్ సిరీస్ లతో కూడా అలరించడానికి సిద్ధం అయ్యారు. అందులో భాగంగానే తాజాగా ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఫస్ట్ ఎవర్ తెలుగు ఒరిజినల్ ఫిలిం గా సూపర్ సుబ్బు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ప్రముఖ ఓటీటీ దిగ్గజంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు భాషతో సంబంధం లేకుండా పలు భాషా చిత్రాలను, వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తొలిసారి నేరుగా తెలుగు వెబ్ సిరీస్ ని తెలుగు ఆడియన్స్ కోసం అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లవర్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధమైన నెట్ ఫ్లిక్స్ . సందీప్ కిషన్ తో సూపర్ సుబ్బు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడో ఈ సినిమా అనౌన్స్మెంట్ అయింది. ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీని కూడా ఈ సీరిస్ పెంచేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సరికొత్త అప్డేట్ తో ట్రెండింగ్ లోకి వచ్చింది సూపర్ సుబ్బు.
ఈ మేరకు తాజాగా ట్రైలర్ ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జూలై 2వ తేదీన నెట్ ఫ్లిక్స్ ఫస్ట్ ఎవర్ తెలుగు ఒరిజినల్ ఫిల్మ్ గా ప్రేక్షకులను సందడి చేయడానికి ఈ సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ రాబోతోంది. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ అండ్ క్వీర్కీ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ ట్రైలర్ ఇప్పుడు వెబ్ సిరీస్ పై అంచనాలు పెంచేసింది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి ఈ ప్రాజెక్టును ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
ఇకపోతే ఈ వెబ్ సిరీస్ లో నవ్వులు పూయించడానికి టాలీవుడ్ కామెడీ కింగ్స్ అంతా ఏకమయ్యారు అని చెప్పాలి. ఇందులో సందీప్ కిషన్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక వీరితోపాటు మురళీ శర్మ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, గెటప్ శ్రీను , హైపర్ ఆది, మానస చౌదరి, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. మొత్తానికైతే ఇంత మంది కామెడీ లెజెండ్స్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తుండడం.. అటు ఫస్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్ కావడంతో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ జూలై 2న బాక్సాఫీస్ రేంజ్ లో ఓటీటీ షేక్ చేయడం ఖాయంగా అనిపిస్తోందంటూ అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
