Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ సిగ్మా.. 'ఓలమ్మో వగలాడి'

బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాతో తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

By:  M Prashanth   |   13 Aug 2026 9:21 AM IST
సందీప్ కిషన్ సిగ్మా.. ఓలమ్మో వగలాడి
X

సందీప్ కిషన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ 'సిగ్మా'. బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాతో తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇదొక స్లీక్ హీస్ట్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేయడంతో సినిమాపై ఒక డిఫరెంట్ వైబ్ పెరిగింది.

యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఈ సినిమాలో మ్యూజిక్ కి కూడా మంచి స్కోప్ ఉన్నట్లు ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్ కి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ లేటెస్ట్ గా 'ఓలమ్మో వగలాడి' అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తోంది.

ఈ పాటకు సంబంధించి ఒక ఆసక్తికరమైన స్పెషాలిటీ ఉంది. తమన్ కంపోజిషన్ లో ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ పాటను పాడటం విశేషం. ఆయన వాయిస్ లో ఉన్న యూత్ ఫుల్ వైబ్ ఈ సాఫ్ట్ మెలోడీకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. దీనికి తోడు కృష్ణ చైతన్య రాసిన లిరిక్స్ కూడా చాలా క్యాచీగా ఉన్నాయి. యువన్ తో పాటు సంజన దివాకర్ కూడా తన వోకల్స్ తో పాటకు మంచి ఫీల్ తీసుకొచ్చింది.

ఈ లవ్లీ సాంగ్ లో సందీప్ కిషన్ తో పాటు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా హైలెట్ అయ్యింది. స్క్రీన్ మీద వీళ్లిద్దరి పెయిరింగ్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది. పాటకు తగ్గట్టుగానే వాళ్ల కెమిస్ట్రీ కూడా చాలా క్యూట్ గా వర్కౌట్ అయింది. మంచి ట్యూన్ కి తోడు కలర్ ఫుల్ విజువల్స్ తోడవడంతో ఈ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

సాధారణంగా హీస్ట్ డ్రామా అనగానే కేవలం సీరియస్ యాక్షన్ సీక్వెన్సులు మాత్రమే ఉంటాయని ఆడియన్స్ ఫిక్స్ అవుతారు. ఆ ఫీలింగ్ బ్రేక్ చేస్తూ ఇలాంటి మంచి మెలోడీస్ ఉండటం సినిమాకు కచ్చితంగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. కథకు అవసరమైన ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ను డైరెక్టర్ కరెక్ట్ ప్రపోర్షన్స్ లో బ్యాలెన్స్ చేశారని ఈ సాంగ్ చూస్తుంటే క్లియర్ గా తెలుస్తోంది.

ఓలమ్మో వగలాడి పాటతో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఇంకొంచెం పెరిగాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది. అన్నీ కరెక్ట్ గా సెట్ చేసుకుని ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ గట్టిగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అఫీషియల్ రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.