Begin typing your search above and press return to search.

కొత్త డైరెక్టర్లకు ఎప్పుడూ నా సపోర్ట్.. తప్పులుంటేనే ఇన్వాల్వ్ అవ్వాలి: సందీప్ కిషన్

ఒక కొత్త దర్శకుడు కథ రాసుకుంటున్నప్పుడు తనను హీరోగా ఊహించుకోవడం గొప్ప ప్రశంస అని సందీప్ కిషన్ అన్నారు.

By:  M Prashanth   |   15 Oct 2026 2:15 PM IST
కొత్త డైరెక్టర్లకు ఎప్పుడూ నా సపోర్ట్.. తప్పులుంటేనే ఇన్వాల్వ్ అవ్వాలి: సందీప్ కిషన్
X

టాలీవుడ్‌ కొత్త దర్శకులను ప్రోత్సహించే హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. కథ నచ్చితే దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేయడానికి ఆయన ఇష్టపడతారు. సినిమా విషయంలో తన సొంత అభిప్రాయాలను దర్శకులపై రుద్దకూడదని అంటున్నారు. కథలో పెద్ద తప్పులు ఉన్నప్పుడే జోక్యం చేసుకోవాలని చెబుతున్నారు. తాజాగా 'కరికాల' సినిమా పూజా కార్యక్రమం సందర్భంగా Tupakiతో ప్రత్యేకంగా మాట్లాడిన సందీప్ కిషన్.. ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

ఒక కొత్త దర్శకుడు కథ రాసుకుంటున్నప్పుడు తనను హీరోగా ఊహించుకోవడం గొప్ప ప్రశంస అని సందీప్ కిషన్ అన్నారు. దర్శకుడు తన స్టోరీని తాను సరిపోతానని నమ్మడం సంతోషాన్నిస్తుందని చెప్పారు. కొత్త దర్శకులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. హీరోగా ఛాన్స్ ఇవ్వడం, నిర్మాతగా సహకరించడం లేదా మరో హీరోకు కథను పరిచయం చేయడం.. ఇలా ఏదోలా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటానని అన్నారు.

సినిమా విషయంలో నటుడికి సొంత ఆలోచనలు ఉండటం తప్పు కాదని, అయితే వాటిని దర్శకుడిపై రుద్దకూడదని సందీప్ కిషన్ అభిప్రాయపడ్డారు. ఒక నటుడిగా తన బాధ్యతల్లో దర్శకుడికి సపోర్ట్ గా నిలవడం ముఖ్యమని చెప్పారు. డైరెక్టర్ కు కంప్లీట్ గా కోపరేట్ చేయాలని, కానీ దర్శకుడు చేసే పనిలో పెద్ద తప్పులు కనిపిస్తే మాత్రం తన అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుందని వివరించారు.

అంతేకానీ, ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం, దర్శకుడిపై ప్రెజర్ తీసుకురావడం సరైన పద్ధతి కాదన్నారు. సినిమాకు డబ్బులు పెట్టే నిర్మాతలకు అనుకున్న రేంజ్ లో రిజల్ట్ రావాలని, అదే సమయంలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటానని సందీప్ కిషన్ అన్నారు. తనను ప్రేమతో నమ్మే నిర్మాతలు ఉండటం చాలా లక్ గా భావిస్తున్నట్లు తెలిపారు.

దర్శకుడు యుగంధర్ ముని సినిమాలు స్పెషల్ గా ఉంటాయని సందీప్ కిషన్ ప్రశంసించారు. ఆయన కథ చెప్పే విధానం, స్క్రీన్ పై చూపించే పద్ధతి నచ్చుతాయని చెప్పారు. 'పవర్ పేట్', 'కరికాల' సినిమాలను ఓకే చేసేటప్పుడు స్టోరీలో ఎలా ఉంది, పాటలు బాగున్నాయా, యాక్షన్ సీన్స్ కొత్తగా ఉంటాయా, తన రోల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే విషయాలను చూసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

ఆ సినిమాల దర్శకులు సినిమా పట్ల ఎంతో ఇంట్రెస్ట్ తో పనిచేస్తారని, చివరి నిమిషం వరకు కష్టపడతారని చెప్పారు. సినిమా విడుదలైన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో ప్రేక్షకులే నిర్ణయిస్తారని అన్నారు. మెగాస్టార్ చిరంజీవితో తను మంచి రిలేఎషన్ ఉందని సందీప్ కిషన్ తెలిపారు. ఇటీవల సిగ్మా ఈవెంట్ లో చిరంజీవి ప్రశంసించడంతో, ఆయన తన సినిమాలు చూశారా అని ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. చిరు పెద్ద మనసున్న వ్యక్తి అని కొనియాడారు.

ఇక సందీప్ హీరోగా నటిస్తున్న 'కరికాల'కు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్‌ పై రాజశేఖర్ అన్నభిమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కేథరిన్ థ్రెసా, గాయత్రీ భరద్వాజ్, సాక్షి మడోల్కర్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను 2027 జులై 2న, రెండో పార్ట్ ను అక్టోబర్ 28న విడుదల చేయనున్నారు.