స్టేజ్ పైనే రెజీనా పరువు తీసిన సందీప్.. ఇలా చేసావేంటి గురూ!
ఒకరికొకరు వ్యక్తిగత విషయాలను పంచుకునేంత చనువు కూడా వారి మధ్య ఉంటుందనడంలో సందేహం లేదు.
By: Madhu Reddy | 9 Aug 2025 3:58 PM ISTసినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒకరికొకరు వ్యక్తిగత విషయాలను పంచుకునేంత చనువు కూడా వారి మధ్య ఉంటుందనడంలో సందేహం లేదు. అలాంటి వారిలో కొంతమంది తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటే.. మరి కొంతమంది జీవితకాలం స్నేహితులుగానే కొనసాగుతాం అని చెబుతారు. అలాంటి వారిలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా ఒకరు. వీరిద్దరూ కలిసి రొటీన్ లవ్ స్టోరీ, మా నగరం, నక్షత్రం, రారా కృష్ణయ్య ఇలా నాలుగు సినిమాలలో నటించారు. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ రూమర్స్ పుట్టుకొచ్చాయి. నిజానికి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. కానీ వీరిద్దరి మధ్య ఉండే చనువు చూసి ఇద్దరు లవ్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పలు రూమర్లు వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఒక షోలో రెజీనా పై సందీప్ కిషన్ చేసిన కామెంట్లు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇంతమాట అన్నావేంటి గురూ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం రెజీనా కసాండ్రా ఢీ డాన్స్ షోలో జడ్జిగా చేస్తోంది . ఈ షోలో భాగంగా ఫ్రెండ్షిప్ థీమ్ తో ఎపిసోడ్ నిర్వహించారు. ఇందులో రెజీనాతో తన బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేయమంటే.. సందీప్ కిషన్ కి ఆమె వీడియో కాల్ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా ఇప్పుడు విడుదల చేశారు నిర్వాహకులు.
రెజీనా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సందీప్ కిషన్ కి కాల్ చేస్తూ.. బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేయమంటే.. నీకు కాల్ చేశాను అని అనడంతో.. అప్పుడప్పుడైనా ఇలా ఎఫెక్షన్ చూపించే ఛాన్సులు వస్తున్నాయి నీకు అని అన్నాడు సందీప్. అలాగే నా లవ్ స్టోరీ లు ఎంత బాధాకరంగా ఉంటాయో అన్ని ఆ అమ్మాయికి తెలుసు అంటే.. నాలాంటి వాళ్ళు ఉంటే నీకు తొందరగా పెళ్లి అవుతుంది అని రెజీనా చెబుతుంది. నీలాంటి వాళ్ళు ఉంటే అసలు పెళ్లి జరగదు అని లైవ్ వీడియో కాల్ లోనే అందరి ముందు సందీప్ సరదాగా కామెంట్లు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే స్టేజ్ పైనే రెజీనా పరువు తీసాడని కొంతమంది సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వీళ్ళ మాటలు బట్టి చూస్తే సందీప్ కిషన్ కి లవ్ స్టోరీలు చాలా ఉన్నాయని, అవన్నీ చాలా బాధతో కూడుకున్నవని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రెజీనా కసాండ్రా విషయానికొస్తే .. గతంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కూడా ఎఫైర్ నడుపుతోంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేకపోయింది. ఇటు సందీప్ తో వార్తలు వచ్చినా.. అవి కూడా కొట్టి పారేసారు. ఇక ప్రస్తుతం ఇలా బుల్లితెర షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది.
