Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ ‘పవర్‌పేట’ గ్లింప్స్.. ఈ మాస్ ఎంట్రీ అరాచకం

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘పవర్‌పేట’ గ్లింప్స్ విడుదలైంది.

By:  M Prashanth   |   7 May 2026 6:16 PM IST
సందీప్ కిషన్ ‘పవర్‌పేట’ గ్లింప్స్.. ఈ మాస్ ఎంట్రీ అరాచకం
X

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘పవర్‌పేట’ గ్లింప్స్ విడుదలైంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి ఒక రకమైన పాజిటివ్ బజ్ ఉంది. లేటెస్ట్ గా విడుదలైన విజువల్స్ చూస్తుంటే, సందీప్ కిషన్ ఈసారి ఒక పక్కా లోకల్ మాస్ క్యారెక్టర్ లో పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది. పీరియడ్ డ్రామాగా, ఏలూరు నేపథ్యంలో సాగే ఈ పొలిటికల్ థ్రిల్లర్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.




అసలు విషయం ఏంటంటే, గ్లింప్స్ లో సందీప్ కిషన్ లుక్, ఆయన చెప్పిన డైలాగులు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సందీప్ ఇందులో సేనాపతి రవి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. "అడవిలో సింహం ఉచ్చ పోసి ఇది నా చోటు అని చెబుతుంది.. ఇక్కడ ఉచ్చ పోయిస్తే కానీ ఈ చోటు నీది కాదు" అంటూ ఆయన చెప్పిన డైలాగ్ సినిమాలో ఆ ర్రా వైబ్ ని చూపిస్తోంది. గ్లింప్స్ లో బాణసంచా కాలుస్తూ, స్పైసీ లుక్ లో సందీప్ కనిపిస్తున్న తీరు చూస్తుంటే, ఆయన కెరీర్ లోనే ఇది ఒక గుర్తుండిపోయే పాత్ర అయ్యేలా ఉంది.

దర్శకుడు కృష్ణ చైతన్య టేకింగ్ లో ఎప్పుడూ ఒక రకమైన ఫ్రెష్ నెస్ ఉంటుంది. ఏ సినిమా చేసినా అందులో లోకల్ నెటివిటీని, రా పాలిటిక్స్‌ను చాలా సహజంగా చూపిస్తారు. ‘పవర్‌పేట’ గ్లింప్స్ లో కూడా అదే కనిపిస్తోంది. పవర్ స్ట్రగుల్ వ్యక్తిగత గౌరవం చుట్టూ తిరిగే ఈ కథలో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా బ్యాలెన్స్ చేయనున్నారట. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్ కు ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చింది. విజువల్స్ పరంగా మది సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది.

సినిమాలో ‘ప్రేమ, గౌరవం, పాలిటిక్స్’ అనే థీమ్స్ ను హైలెట్ చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ మెంట్ పోస్టర్ తో హింట్ ఇచ్చారు. అధికారం కోసం ఒక సామాన్యుడు చేసే పోరాటం, అందులోని లోతుపాతులను దర్శకుడు తనదైన శైలిలో అగ్రెసివ్ గా ప్రెజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గలేదని గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది. సందీప్ కిషన్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ విజువల్స్ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

కృష్ణ చైతన్య మార్క్ మాస్ మేకింగ్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో ‘పవర్‌పేట’ ఒక క్రేజీ ప్రాజెక్ట్ గా రాబోతున్నట్లు అర్ధమవుతుంది. కంటెంట్ మీద గ్రిప్ ఉన్న దర్శకుడు కావడంతో ఈసారి సందీప్ కిషన్ కు ఒక సాలిడ్ హిట్ పడటం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ ఏలూరు పొలిటికల్ ఆటలో సేనాపతి రవి ప్రయాణం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని అప్‌డేట్స్ వచ్చే వరకు వేచి చూడాలి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.