శంబాల టీమ్ వన్స్ మోర్.. ఈసారి అంతకుమించి..
యంగ్ హీరో ఆది సాయికుమార్ లీడ్ రోల్ లో నటించిన శంబాల మూవీతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ షైనింగ్ పిక్చర్స్ ఫుల్ జోష్ లో ఉంది.
By: M Prashanth | 21 March 2026 2:14 PM ISTయంగ్ హీరో ఆది సాయికుమార్ లీడ్ రోల్ లో నటించిన శంబాల మూవీతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ షైనింగ్ పిక్చర్స్ ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. దర్శకుడు ఉగంధర్ మునితో కలిసి ఆ సంస్థ మరోసారి చేతులు కలిపి, ఈసారి గ్రాండ్ గా సోషియో ఫాంటసీ మూవీ రూపొందించనుంది. ఆ సినిమాలో హీరోగా టాలెంటెడ్ సందీప్ కిషన్ నటించనుండడం విశేషం.
ఆ సినిమాను రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనుండగా.. వారు రూపొందించిన శంబాల మంచి విజయం సాధించడంతో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటూ ఫుల్ వైరల్ అవుతోంది.
పోస్టర్ లో సింహం, నక్క మధ్య పోరాటాన్ని చూపిస్తూ.. పవర్, ఫేట్, డామినేషన్ ఎలిమెంట్స్ తో రూపొందించారు. మధ్యలో ఫుల్ షైన్ తో కనిపిస్తున్న వింటేజ్ కత్తి, వెనుక భాగంలో మిస్టికల్ బ్యాక్ డ్రాప్ సినిమాకు ఉండే గ్రాండియర్ ను సూచిస్తున్నాయి. సమ్ వార్స్ నెవర్ ఎండ్.. సమ్ కింగ్స్ నెవర్ డై అనే ట్యాగ్ లైన్ సినిమాపై ఆసక్తి మరింత పెంచుతోంది.
అయితే సందీప్ కిషన్ సినిమాలో పూర్తిగా కొత్త అవతార్ లో కనిపించనున్నట్లు సమాచారం. తన కెరీర్ లో ఇప్పటివరకు చేయని పాత్రను పోషించనున్నారని టాక్ వినిపిస్తోంది. యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్స్ ఎలిమెంట్స్ తో మూవీ రూపొందనుందని తెలుస్తోంది. అదే సమయంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డితో ఉగంధర్ ముని రెండో ప్రాజెక్టు కావడంతో అందరి ఫోకస్ పడింది.
ఈసారి మరిన్ని టెక్నికల్ ఎలిమెంట్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా రూపొందేలా ప్లాన్ వేసుకుంటున్నారు మేకర్స్. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, కథనం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సందీప్ కిషన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న చిత్రంగా ఇది నిలవనుందని సమాచారం.
దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్ త్వరలో ప్రకటించనున్నారు. ఆగస్టులో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఏదేమైనా శంబాల సక్సెస్ తర్వాత అదే టీమ్ రూపొందిస్తున్న భారీ ఫాంటసీ ప్రాజెక్ట్ పై సినీ ప్రియుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ మూవీ కూడా అదే రేంజ్ లో విజయం సాధిస్తుందా అన్నది వేచి చూడాలి.
