సీఎం కొడుకు సందీప్ కిషన్ కు ఫ్యాన్ అయ్యాడట
ఇప్పుడు అదే హీరోతో తన మొదటి సినిమాను తెరకెక్కించారు. దీంతో సిగ్మా విషయంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ కనెక్షన్ హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 16 Sept 2026 6:02 PM ISTహీరో ఎవరైతే ఏంటి నచ్చితే ఫ్యాన్ అయిపోవాల్సిందే. ఇప్పుడు ఇదే ఫ్యానిజం ఓ సినిమాకు బేస్ అయింది! హీరో సందీప్ కిషన్ అంటే దర్శకుడు జేసన్ సంజయ్ కు చాలా ఇష్టం. ఏకంగా సందీప్ నటించిన మైఖేల్ సినిమా చూసిన తర్వాత ఆయనకు ఫ్యాన్ గా మారారట. ఇప్పుడు అదే హీరోతో తన మొదటి సినిమాను తెరకెక్కించారు. దీంతో సిగ్మా విషయంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ కనెక్షన్ హాట్ టాపిక్ గా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరో, సీఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమానే సిగ్మా. సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా కనిపించనున్నారు. అడ్వెంచర్, ట్రెజర్ హంట్, యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా రూపొందింది. తన మొదటి సినిమాతోనే పక్కా కమర్షియల్ మూవీ చేయాలని జేసన్ ఫిక్స్ అయినట్లు ఆయన కామెంట్స్ బట్టి తెలుస్తోంది.
సిగ్మా గురించి జేసన్ మాట్లాడుతూ, ఇదే తన ఫస్ట్ ఫిల్మ్ అని చెప్పారు. అక్టోబర్ 2న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. సినిమా కోసం మరిన్ని ఈవెంట్స్ జరగనున్నాయని చెప్పారు. ముఖ్యంగా మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని, అడ్వెంచర్, ట్రెజర్ ఎలిమెంట్స్ మెయిన్ గాా ఉంటాయని వెల్లడించారు. పక్కా కమర్షియల్ ఫిల్మ్ గా సిగ్మాను రూపొందించినట్లు తెలిపారు.
అయితే సినిమా విశేషాల కంటే, సందీప్ కిషన్ గురించి జేసన్ చేసిన కామెంట్సే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు ఊరు పేరు భైరవకోన అంటే ఇష్టమని జేసన్ చెప్పారు. సందీప్ కిషన్ నటించిన ఆ ఫాంటసీ, సస్పెన్స్ థ్రిల్లర్ తనకు నచ్చిన సినిమాల్లో ఒకటని తెలిపారు. కానీ మైఖేల్ సినిమా చూసిన తర్వాత మాత్రం సందీప్ పై తన అభిమానం పెరిగిందట. ఆ సినిమా తర్వాతే తాను సందీప్ కిషన్‌కు ఫ్యాన్ గా మారానని జేసన్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా ఆ సినిమాలో సందీప్ లుక్, యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ జేసన్ ను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే సిగ్మాపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. తనకు నచ్చిన హీరోను తన తొలి సినిమాకు ఎంచుకున్న జేసన్, ఆ హీరోతో ఎలాంటి కథ చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్ గా మారిన హీరోనే తన డైరెక్షన్ డెబ్యూలో లీడ్ రోల్ లో పెట్టడం సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
అయితే సిగ్మా నార్మల్ స్టోరీ కాదు. నిధి అన్వేషణ చుట్టూ తిరిగే అడ్వెంచర్ ఎలిమెంట్స్ తోపాటు హైస్ట్, యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో ఉండనున్నాయి. అంటే సందీప్ కిషన్ కు సరిపోయే యాక్షన్ టచ్ తో పాటు జేసన్ తనదైన స్టైల్ ను చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అలా ఫ్యాన్ నుంచి డైరెక్టర్ గా మారిన జేసన్.. తన ఫేవరెట్ హీరోతో చేసిన సినిమా ఎలా ఉండబోతుందన్నది అక్టోబర్ 2న సిగ్మా ప్రేక్షకుల ముందుకు వచ్చాక తెలియనుంది.
