Begin typing your search above and press return to search.

పవర్ పేట.. ప్రస్థానం మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

సందీప్ కిషన్ కెరీర్ కు బలమైన పునాది వేసిన సినిమా ప్రస్థానం.. అందులో కుర్ర సైకో పాత్రలో సందీప్ చేసిన యాక్టింగ్ చూసి అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు.

By:  M Prashanth   |   1 Oct 2026 6:19 PM IST
పవర్ పేట.. ప్రస్థానం మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
X

సందీప్ కిషన్ కెరీర్ కు బలమైన పునాది వేసిన సినిమా ప్రస్థానం.. అందులో కుర్ర సైకో పాత్రలో సందీప్ చేసిన యాక్టింగ్ చూసి అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మళ్ళీ దశాబ్దంన్నర తరువాత అలాంటి ఒక ఇంటెన్స్ పొలిటికల్ ప్రపంచంలోకి సందీప్ హీరోగా అడుగుపెడుతున్నాడు అనిపిస్తోంది. రీసెంట్ గా తను చెప్పిన వివరాలు వింటుంటే కచ్చితంగా ఇది మరో ప్రస్థానం రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనేలా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

90 నాటి విజయవాడ రాజకీయాలు అనగానే ఒక రకమైన రస్టిక్ ఫీల్ కళ్ళముందు మెదులుతుంది. అయితే రౌడీయిజం, కత్తుల గోలతో సరిపెట్టకుండా అసలైన పొలిటికల్ పవర్ ప్లే చుట్టూ ఈ కథను అల్లుకున్నారట. అప్పట్లో ప్రస్థానం కూడా కేవలం యాక్షన్ మీద కాకుండా మనుషుల సైకాలజీ, పాలిటిక్స్ ఆధారంగానే నడిచింది. ఇప్పుడు అదే తరహాలో రాజకీయ ఎత్తుగడలు కలగలిపిన ఒక సాలిడ్ స్టోరీతో సందీప్ రాబోతున్నాడు.

ప్రస్థానం నాటికి సందీప్ కిషన్ ఇండస్ట్రీకి కొత్త. ఆ సినిమాలో శర్వానంద్, సాయి కుమార్ లాంటి వాళ్ల మధ్యలో తనదైన ముద్ర వేశాడు. కానీ ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ యాక్టర్ గా, ఏకంగా ప్రాజెక్ట్ ను తన భుజాలపై మోసే లీడ్ హీరోగా ఈ పొలిటికల్ డ్రామాను డీల్ చేయబోతున్నాడు. తన కెరీర్ లోనే ఇది బెస్ట్ క్యారెక్టర్ అని అతను అంత కాన్ఫిడెంట్ గా చెప్పడం చూస్తుంటే, హీరోగా తనలోని అసలైన పొటెన్షియల్ ను బయటకు తీసే స్క్రిప్ట్ దొరికిందని అర్థమవుతోంది.

ఈ ప్రాజెక్ట్ మీద ఇంత బజ్ రావడానికి మరో ప్రధాన కారణం దర్శకుడు కృష్ణ చైతన్య. ఆయన రైటింగ్ స్కిల్స్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒక బలమైన ఎమోషన్ ను, రా అండ్ రస్టిక్ గా ప్రెజెంట్ చేయడంలో ఆయన మార్క్ వేరు. మనుషుల ఈగోలకు, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ముడిపెడుతూ కృష్ణ చైతన్య రాసిన విధానం అద్భుతంగా ఉందని అన్నారు.

కథకు తగ్గట్టుగానే ఈ సినిమా కోసం ఒక భారీ క్యాస్టింగ్ ను సెట్ చేస్తున్నారు. మామూలుగా ఇలాంటి పొలిటికల్ సినిమాలకు సరైన నటీనటులు పడితే సగం హిట్ అయినట్లే. ఆ విషయంలో దర్శకుడు కృష్ణ చైతన్య పక్కా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ చిల్లా, శశి లాంటి ప్యాషనేట్ నిర్మాతలు తోడవడంతో ఈ సినిమా అవుట్ పుట్ క్వాలిటీ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సందీప్ వివరణ ఇచ్చారు. పీరియాడిక్ కథలను తెరకెక్కించడంలో ఆర్ట్ డైరెక్షన్, డీటెయిలింగ్ అత్యంత కీలకం. 90ల నాటి సెటప్ అనగానే లొకేషన్స్, అప్పటి వాతావరణం రీక్రియేట్ చేయడంపైనే బడ్జెట్ భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇక పవర్ పేట విషయంలో కూడా మేకర్స్ అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నెక్ట్స్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.