Begin typing your search above and press return to search.

అమర్దీప్ చౌదరి మూవీ.. ఎక్కడే ఎక్కడే అంటూ లవ్ మ్యాజిక్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ లవ్ సాంగ్ వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తి మరింత పెంచుతోంది.

By:  M Prashanth   |   13 Jan 2026 7:00 PM IST
అమర్దీప్ చౌదరి మూవీ.. ఎక్కడే ఎక్కడే అంటూ లవ్ మ్యాజిక్!
X

సీరియల్ యాక్టర్ అమర్దీప్‌ చౌదరి కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సీరియల్స్, బిగ్‌ బాస్ ద్వారా ఎంతోమంది ఫ్యాన్స్‌ ను సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై హీరోగా తన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సుమతీ శతకం మూవీ చేస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాలో శైలి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎంఎం నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు.

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఆ మూవీ.. ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మూవీపై పాజిటివ్ బజ్ నెలకొంది. అయితే తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. సినిమా నుంచి తొలి మెలోడీ సాంగ్ ఎక్కడే ఎక్కడే రిలీజ్ చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ లవ్ సాంగ్ వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తి మరింత పెంచుతోంది. ఎక్కడే ఎక్కడే అంటూ సాగుతున్న పాటకు తిరుపతి జావన లిరిక్స్ అందించగా, ధనుంజయ్ సీపాన ఆలపించారు. సుభాష్ ఆనంద్ కంపోజ్ చేశారు. అయితే ప్రేమలో ఉన్న మనసు వెతుకులాట, ఎమోషన్స్ ప్రతిబింబించేలా ఉన్న పాట.. మంచి మెలోడీగా మ్యూజిక్ లవర్స్ ఫేవరెట్ లిస్ట్ లోకి చేరిపోయింది.

తిరుపతి సరైన లిరిక్స్ అందించగా, ధనుంజయ్ తన స్వరంతో ప్రాణం పోశారు. సుభాష్ ఆనంద్ మెలోడీ ట్యూన్.. సాంగ్ ను స్పెషల్ గా మార్చింది. లిరిక్స్‌ కు తగ్గట్టుగా మ్యూజిక్, సింగింగ్ ఉండడంతో వినడానికి ఎంతో హాయిగా అనిపించేలా సాంగ్ ఉందనే చెప్పాలి. అదే సమయంలో అమర్దీప్ తన స్టెప్పులతో అలరిస్తూ చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. విజువల్స్ ఎంతో నేచురల్ గా.. వావ్ అనేలా ఉన్నాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఇక సినిమా విషయానికొస్తే.. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరితోపాటు టేస్టీ తేజ, మహేష్ విట్ట, జేడీవీ ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరి పాత్రలకు కథలో మంచి ప్రాధాన్యత ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. సాంకేతికంగా కూడా సినిమాకు స్ట్రాంగ్ టీం వర్క్ చేస్తుంది.

ఎస్ హలేష్ సినిమాటోగ్రఫీ అందించగా, నాహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేశారు. విజువల్స్, కథనం రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు ఇప్పటికే టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. మొత్తంగా ఎక్కడే ఎక్కడే పాటతో సుమతీ శతకం మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. మరి వచ్చే నెలలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న సుమతీ శతకం మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.