Begin typing your search above and press return to search.

రెండు బ్లాక్‌బస్టర్లు మిస్… కెరీర్‌పై సుమంత్ షాకింగ్ కామెంట్స్!

వర్సటైల్ యాక్టర్ సుమంత్, తాజాగా తన కెరీర్‌లో మిస్ అయిన రెండు భారీ బ్లాక్‌బస్టర్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

By:  Madhu Reddy   |   29 July 2026 7:10 PM IST
రెండు బ్లాక్‌బస్టర్లు మిస్… కెరీర్‌పై సుమంత్ షాకింగ్ కామెంట్స్!
X

తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న వర్సటైల్ యాక్టర్ సుమంత్, తాజాగా తన కెరీర్‌లో మిస్ అయిన రెండు భారీ బ్లాక్‌బస్టర్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన సుమంత్, టాలీవుడ్‌లో రికార్డులు సృష్టించిన ‘నువ్వే కావాలి’, ‘దేశముదురు’ కథలు మొదట తన వద్దకే వచ్చాయని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు..

డేట్స్ కుదరక 'నువ్వే కావాలి' మిస్:

దర్శకుడు కె. విజయభాస్కర్ తెరకెక్కించిన యూత్‌ఫుల్ సన్సేషన్ 'నువ్వే కావాలి' ఆఫర్ మొదట సుమంత్‌కే వచ్చిందట.ఇక ఆ సమయంలో తాను ‘యువకుడు’, ‘పెళ్లి సంబంధం’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత ఈ సినిమాలో తరుణ్ నటించి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. ఇక ఇప్పటికీ ఈ బ్లాక్‌బస్టర్ మూవీ మిస్ అయ్యాననే బాధ తన మనసులో ఉందని సుమంత్ ఓపెన్‌గా చెప్పారు.

బన్నీ ఎనర్జీ వల్లే 'దేశముదురు' హిట్:

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన మాస్ ఎంటర్‌టైనర్ 'దేశముదురు' స్క్రిప్ట్ కూడా ఫస్ట్ సుమంత్ వద్దకే వచ్చిందట. అయితే "ఆ సినిమా నేను చేసి ఉంటే అంత పెద్ద సక్సెస్ అయ్యేది కాదేమో.. అల్లు అర్జున్ ఉన్న ఫేమ్, ఆయన చూపించిన ఎనర్జీ వల్లే ఆ సినిమా రూ.కోట్ల కలెక్షన్లు రాబట్టింది" అంటూ సుమంత్ చాలా నిజాయితీగా, హుందాగా మాట్లాడటం విశేషం.

జులై 31న 'న్యూటన్స్ థర్డ్ లా':

ఇక సుమంత్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’ విడుదలకు సిద్ధమైంది. ఇక రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో జగపతిబాబు, కార్తీక్‌ రత్నం, రవి వర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కె. హరీశ్‌ నిర్మించిన ఈ చిత్రం జులై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక దీని తర్వాత 'మహేంద్రగిరి వారాహి' అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో ఆయన అలరించనున్నారు. ఇదివరకు సుమంత్‌తో 'సుబ్రమణ్యపురం' తెరకెక్కించిన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో, 'రంగమార్తాండ' నిర్మించిన మధు కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

భారీ విజువల్ ఎఫెక్ట్స్‌:

ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా డివైన్ ఎలిమెంట్స్, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో వస్తున్న ఈ సినిమా ప్రోమోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మొదట రూ. 10 కోట్ల బడ్జెట్‌తో అనుకున్నప్పటికీ, సినిమాలో దాదాపు గంటపాటు ఉండే గ్రాండ్ వీఎఫెక్స్ కారణంగా ఏకంగా రూ. 26 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ప్రమోషనల్ కంటెంట్‌లో కనిపిస్తున్న విజువల్ గ్రాండియర్ చూస్తుంటే ఈ సినిమా సుమంత్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది.

కెరీర్‌ను మార్చేసిన నిర్ణయాలు:

సినిమా పరిశ్రమలో ఒక నటుడు వదులుకున్న కథలు మరొకరి జీవితాన్ని ఎలా మైలురాళ్లుగా మారుస్తాయో అనడానికి ఈ రెండు సినిమాలే ఉదాహరణ. ఇక ఏది ఏమైనా సుమంత్ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన నిజాయితీని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. మరి జులై 31న రాబోతున్న ‘న్యూటన్స్ థర్డ్ లా’ సినిమా ఆయనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.