మరో తెలంగాణ నేటివిటీ లవ్ స్టోరీకి రంగం సిద్ధం!
ఈ సినిమాకు రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ సాయిలు కంపటి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 27 Jun 2026 5:00 PM ISTమేమ్ ఫేమస్ సినిమాతో హీరోగా, డైరెక్టర్ గా ఒకేసారి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన యంగ్ టాలెంట్ సుమంత్ ప్రభాస్.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన గత సినిమాల్లో తెలంగాణ నేటివిటీ, నేచురల్ క్యారెక్టర్స్, యూత్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్‌ను ప్రధాన బలంగా మార్చుకున్న సుమంత్.. ఈసారి కూడా అదే ఫ్లేవర్‌ను కొనసాగిస్తూ ఓ కొత్త లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాకు రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ సాయిలు కంపటి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. తన తొలి సినిమాతోనే గ్రామీణ వాతావరణం, ఎమోషన్స్ ను సహజంగా చూపించగల డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయిలు.. ఇప్పుడు సుమంత్ ప్రభాస్ వంటి నేచురల్ పెర్ఫార్మర్‌తో చేతులు కలపడం ఆసక్తిని పెంచుతోంది. స్టోరీ సెలెక్షన్ లో ఇద్దరికీ ఉన్న ప్రత్యేక అభిరుచి ఈ కాంబినేషన్‌పై మంచి అంచనాలు ఏర్పడేలా చేస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగే సరదా ప్రేమకథగా రూపొందనుందని తెలుస్తోంది. గ్రామీణ జీవనశైలి, స్థానిక సంస్కృతి, యూత్ రిలేషన్‌షిప్స్‌ను ఎంటర్టైనింగ్ గా చూపిస్తూ, ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యం ఇచ్చే విధంగా కథను రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందిన నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ కూడా అదే తరహాలో ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో విశేషం ఏమిటంటే, ఈ సినిమాను ఏషియన్ ఫిల్మ్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలను ప్రోత్సహిస్తున్న ఈ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న మరో యూత్‌ఫుల్ ప్రాజెక్ట్ కావడంతో ఇండస్ట్రీలో మంచి ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమాకు అధికారిక పూజా కార్యక్రమంతో క్లాప్ కొట్టనున్నారని, అనంతరం నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. సుమంత్ ప్రభాస్ కెరీర్‌ను పరిశీలిస్తే, కమర్షియల్ అంశాలతో పాటు కథలో కొత్తదనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. మేమ్ ఫేమస్ తర్వాత ఆయన చేసిన సినిమాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు సాయిలు కంపటి లాంటి కథ చెప్పడంలో ప్రత్యేకమైన శైలి ఉన్న డైరెక్టర్ తో జతకట్టడం ఆయన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన అడుగుగా మారే అవకాశముంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో డిస్కషన్ మొదలైంది. తెలంగాణ నేటివిటీ, వినోదం, ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కనున్న ఈ సినిమా సుమంత్ ప్రభాస్‌కు మరో గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందేమో చూడాలి.
