Begin typing your search above and press return to search.

‘స్పిరిట్’ ఖతర్నాక్ కదా అన్నా.. సందీప్ వంగాతో యువ హీరో

సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రాబోతున్న ‘రోమాంచకం’ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు స్పీడ్ అందుకున్నాయి.

By:  M Prashanth   |   21 Aug 2026 8:17 PM IST
‘స్పిరిట్’ ఖతర్నాక్ కదా అన్నా.. సందీప్ వంగాతో యువ హీరో
X

సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రాబోతున్న ‘రోమాంచకం’ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు స్పీడ్ అందుకున్నాయి. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సందీప్ బ్రాండ్ తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్ మీద జనాల్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో లేటెస్ట్‌గా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్ర యూనిట్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేసింది.

ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సుమంత్ ప్రభాస్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. రోమాంచకం సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగాతో తనకున్న బాండింగ్ గురించి సుమంత్ సరదాగా వివరణ ఇచ్చాడు. సందీప్ వంగాను తాను ఎంతగానో అభిమానిస్తానని, ఇప్పుడు ఆయన సమర్పణలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.

ఇదే ప్రెస్‌మీట్‌లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్పిరిట్' సినిమా ప్రస్తావన కూడా రావడం విశేషం. బయట అందరిలాగే తాను కూడా సందీప్ వంగాను 'స్పిరిట్' గురించి అడిగానని సుమంత్ ప్రభాస్ నవ్వుతూ చెప్పాడు. "అన్నా.. స్పిరిట్ అయితే ఖతర్నాక్ వస్తుంది కదా" అని తాను అడగ్గా.. దానికి సందీప్ "మీరు నన్ను టెన్షన్ పెట్టేస్తున్నారు" అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చినట్లు సుమంత్ రివీల్ చేశాడు.

ఇక రోమాంచకం సినిమా విషయానికి వస్తే.. రామ్ గోపాల్ వర్మ దగ్గర సుదీర్ఘకాలం పాటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సుమంత్ ప్రభాస్‌కు జోడీగా అనంతిక సనిల్‌కుమార్ నటిస్తోంది. ఇదొక రెగ్యులర్ లవ్ స్టోరీ కాదని, ప్రేమతో పాటు మంచి కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా సినిమా అంతా ఉంటాయని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 'రాధా రమణ' పాట, టైటిల్ ట్రాక్, గ్లింప్స్‌ సినిమా మూడ్ ను పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేశాయి. వాసుకి వైభవ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి టేకింగ్, భద్రకాళి పిక్చర్స్ నిర్మాణ విలువలతో వస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 3న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.