పెళ్లికి ముందే అన్నీ చెప్పా. ఆమె విషయంలో సంతోషంగా ఉన్నా..
కానీ చాలా కొంతమంది మాత్రమే భార్యాభర్తలుగా విడిపోయాక కూడా మంచి స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. అందులో టాలీవుడ్ నటుడు సుమంత్ కూడా ఒకరు.
By: Sravani Lakshmi Srungarapu | 20 Jan 2026 12:44 PM ISTసెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు, వారి గొడవలు ఏవైనా సరే జనాలకు భలే ఇంట్రెస్ట్. సెలబ్రిటీలు అనే కాదు, పక్క వారి జీవితంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలని అందరూ తహతహ లాడుతుంటారు. సెలబ్రిటీల విషయంలో అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యాభర్తలు ఎవరైనా సరే విడిపోయారంటే వాళ్లు మళ్లీ మాట్లాడుకోరు.
కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్న సుమంత్
కానీ చాలా కొంతమంది మాత్రమే భార్యాభర్తలుగా విడిపోయాక కూడా మంచి స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. అందులో టాలీవుడ్ నటుడు సుమంత్ కూడా ఒకరు. సుమంత్ కు 2004లో కీర్తి రెడ్డితో పెళ్లి జరిగింది. ఆ తర్వాత 2006లోనే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. పర్సనల్ రీజన్స్ తో విడాకులు తీసుకున్న సుమంత్, కీర్తి ఇప్పటికీ మాట్లాడుకుంటారట.
తరచూ కీర్తితో మాట్లాడుతుంటా
ఈ విషయాన్ని స్వయంగా సుమంత్ వెల్లడించారు. కీర్తి, తాను ఇప్పటికీ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్నామని, తరచుగా ఆమెతో మాట్లాడుతుంటానని, కీర్తి పెళ్లి చేసుకుని బెంగుళూరులో సెటిలైందని, తనకు మంచి ఫ్యామిలీ దొరికిందని, ఆమె సంతోషంగా ఉన్నందుకు తాను చాలా హ్యాపీగా ఉన్నానని సుమంత్ చెప్పారు. పెళ్లికి ముందే తనకు సంబంధించిన అన్నీ విషయాల్నీ కీర్తితో చెప్పినట్టు కూడా సుమంత్ ఈ సందర్భంగా తెలిపారు.
టాటూలు నచ్చవు
ప్రస్తుతానికి తనకు గర్ల్‌ఫ్రెండ్ లాంటివారెవరూ లేరని, మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని, ఒకవేళ ఫ్యూచర్ లో ఆలోచన మారితే మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తిని లైఫ్ పార్టనర్ గా చేసుకుంటానని చెప్పారు సుమంత్. తనకు టాటూలు, చెవులకు ఎక్కువ రింగ్స్ పెట్టుకోవడం లాంటివి నచ్చవని చెప్పారు. ప్రస్తుతం తాను ఒంటరిగా, పెంపుడు కుక్కలు, ఫ్రెండ్స్, హోమ్ థియేటర్ తో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పిన సుమంత్, తనకు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె యాక్టింగ్ అంటే ఇష్టమని తెలిపారు.
