మృణాల్ కు అల్లు బాస్ సజెషన్.. రూమర్లపై సుమంత్ రెస్పాన్స్ ఏంటి?
టాలీవుడ్ నటుడు సుమంత్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేర్లు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
By: M Prashanth | 13 April 2026 6:48 PM ISTటాలీవుడ్ నటుడు సుమంత్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేర్లు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వీరిద్దరి పెళ్లి, డేటింగ్ పై గతంలో వచ్చిన రూమర్లు మళ్లీ తెరపైకి రావడంతో అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే ఆ వార్తలపై తాజాగా సుమంత్ క్లారిటీ ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
గతంలో సీతారామం సినిమా టైమ్ లో సుమంత్, మృణాల్ మధ్య ప్రేమ ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే సుమంత్ ఊహాగానాలను ఖండిస్తూ, అవి పూర్తిగా ఫేక్ అని చెప్పారు. అయినప్పటికీ, కొంతకాలం తర్వాత ఇప్పుడు మళ్లీ అవే రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
ఇటీవల మృణాల్ నటించిన డెకాయిట్ సినిమా మంచి స్పందన అందుకోవడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి సుమంత్ అతిథిగా హాజరయ్యారు. అదే వేదికపై మృణాల్ కూడా ఉండటంతో, ఇద్దరూ కలిసి కనిపించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి.
కార్యక్రమంలో మాట్లాడుతూ.. మృణాల్ ను ఉద్దేశించి, హైదరాబాద్ లోనే ఒక మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని సరదాగా అన్నారు. దీనికి మృణాల్ చిరునవ్వుతో స్పందించడం గమనార్హం. అయితే ఆ వ్యాఖ్యలను కొంతమంది నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని, సుమంత్ తో మృణాల్ కు నిజంగానే సంబంధం ఉందని వార్తలు స్ప్రెడ్ చేయడం ప్రారంభించారు.
దీంతో మరోసారి సుమంత్, మృణాల్ డేటింగ్ రూమర్లు ఊపందుకున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రెస్పాండ్ అవుతూ సుమంత్ స్పష్టత ఇచ్చారు. 'మృణాల్ ను నేను మొదటిసారి ఐదేళ్ల క్రితం సీతారామం సినిమా సమయంలోనే కలిశాను. ఆ తర్వాత మేమిద్దరం ప్రత్యేకంగా కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు వస్తున్న డేటింగ్ వార్తల్లో ఎలాంటి నిజం లేదు' అని తెలిపారు.
ఆ వ్యాఖ్యలతో అన్ని అనుమానాలకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. సినీ పరిశ్రమలో సహజంగానే హీరోహీరోయిన్ల మధ్య స్నేహాన్ని ప్రేమగా మలచి రూమర్లు సృష్టించడం కొత్త విషయం కాదు. అయితే ఆ సందర్భంలో కూడా అలాంటి ఊహాగానాలకే ఎక్కువ ప్రాధాన్యం లభించింది. కానీ వాస్తవానికి వీరిద్దరి మధ్య అలాంటి వ్యక్తిగత సంబంధం లేదని సుమంత్ మాటలతో స్పష్టమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుమంత్– మృణాల్ డేటింగ్ వార్తలు పూర్తిగా ఆధారంలేనివేనని తేలిపోయింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి రూమర్లు రావడం సహజమే అయినప్పటికీ.. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం మంచిది కాదని సినీ ప్రియులు సూచిస్తున్నారు. మరి దీనిపై మృణాల్ ఏమైనా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.
