Begin typing your search above and press return to search.

మహేంద్రగిరి వారాహిని మురారితో పోల్చొద్దు: సుమంత్

డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన మహేంద్రగిరి వారాహి మూవీపై హీరో సుమంత్ ఫుల్ నమ్మకంతో ఉన్నారు. సినిమా ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని తెలిపారు.

By:  M Prashanth   |   8 Sept 2026 10:43 PM IST
మహేంద్రగిరి వారాహిని మురారితో పోల్చొద్దు: సుమంత్
X

డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన మహేంద్రగిరి వారాహి మూవీపై హీరో సుమంత్ ఫుల్ నమ్మకంతో ఉన్నారు. సినిమా ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని తెలిపారు. సుమంత్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ నటించిన ఆ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ నిర్మించగా, సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.




అయితే తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ మీడియాతో మాట్లాడారు. మహేంద్రగిరి వారాహి తన కెరీర్‌ లో ఇటీవల వచ్చిన పెద్ద బడ్జెట్ సినిమాల్లో ఒకటని చెప్పారు. నిర్మాతలు మూవీని భారీ స్థాయిలో నిర్మించారని తెలిపారు. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి సినిమాపై నమ్మకం మరింత పెరిగిందని అన్నారు.

దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కథను సింగిల్ సిట్టింగ్‌ లో చెప్పారని సుమంత్ తెలిపారు. కథ మొత్తం తనకు నచ్చిందన్న ఆయన.. ముఖ్యంగా ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు ఓ రేంజ్ లో నచ్చుతాయని అంచనా వేశారు. పురాణాలపై దర్శకుడికి మంచి అవగాహన ఉందని, అందుకే కథను ఆయన అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. వీఎఫ్‌ఎక్స్, క్యాస్టింగ్, యాక్షన్, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్.. ఇలా అన్నీ సినిమాకు కలిసొచ్చాయని చెప్పారు.

సినిమాలో తాను యూట్యూబ్‌ లో మూఢ నమ్మకాలను ప్రశ్నించే వ్యక్తి పాత్రలో కనిపిస్తానని సుమంత్ వెల్లడించారు. అయితే తన రోల్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే చెప్పలేనన్న ఆయన.య డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా ఉండటంతో పాటు మంచి ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నాయని చెప్పారు. సిద్దు జొన్నలగడ్డ సినిమాలో సీరియస్ రోల్ లో కనిపిస్తారని రివీల్ చేశారు.

తమ మధ్య వచ్చే ఓ సీన్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పారు. ఆ సీన్ చూసిన వారంతా చాలా బాగా వచ్చిందని చెప్పారని, సినిమాలో సిద్దు రోల్ బాగుంటుందని అన్నారు. ఆ రోల్ కు ఓకే చెప్పినందుకు సిద్ధుకు థ్యాంక్స్ చెప్పారు. ట్రైలర్‌ లో 33 ఏళ్లు దాటిన తర్వాత ఓ వంశానికి చెందిన వ్యక్తులు చనిపోతున్నట్లు చూపించడంతో మురారి సినిమా గుర్తుకొస్తుందని సుమంత్ చెప్పారు. అయితే రెండు సినిమాల స్టోరీ, స్క్రీన్‌ ప్లే పూర్తిగా వేర్వేరుగా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.

మహేంద్రగిరి వారాహి స్పెషల్ స్టోరీతో రూపొందిందన్న సుమంత్.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ స్ట్రెంత్ గా నిలుస్తుందని సుమంత్ చెప్పారు. కచ్చితంగా గూస్‌ బంప్స్ ఎక్స్పీరియన్స్ వస్తుందని అన్నారు. సినిమాలో మూడు మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్‌ తోపాటు మరికొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని తెలిపారు. వారాహి టైటిల్‌ స్టోరీ అనుకున్న సమయంలోనే రిజిస్టర్ చేశామని చెప్పిన ఆయన, పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో ఆ పేరు పాపులర్ అయిందని చెప్పుకొచ్చారు. ఆ పాజిటివ్ ఎఫెక్ట్ తమ సినిమాకు కూడా కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు చెప్పారు.