నన్ను వాళ్ళు నాలుగైదుసార్లు ఆడిషన్స్ ఇచ్చినా రిజెక్ట్ చేసారు
అక్కినేని అందగాడు ఏఎన్నార్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసినదే.
By: Sivaji Kontham | 1 Aug 2025 11:57 PM ISTఅక్కినేని అందగాడు ఏఎన్నార్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసినదే. అక్కినేని జాతీయ అవార్డులను ప్రతియేటా దేశంలోని ప్రతిభావంతులకు అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఏఎన్నార్ చివరి చిత్రం `మనం`లో ఆయన నటన ఎప్పటికీ హృదయాలలో నిలిచిపోయింది. కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన లెజెండరీ నటుడు ఏఎన్నార్ వారసత్వాన్ని నిలబెడుతూ, కింగ్ నాగార్జున పరిశ్రమ అగ్ర నటుడిగా, నిర్మాతగా చక్రం తిప్పుతున్నారు.
అయితే దిగ్గజ నటులు ఏఎన్నార్, నాగార్జున అండదండలు తనకు ఉన్నా కానీ, సుమంత్ కెరీర్ పరంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నటవారసుడిగా ప్రవేశించినా ఆశించిన స్థాయి దక్కలేదు. ఇదిలా ఉంటే అతడు కంబ్యాక్ కోసం ఇప్పటికీ సిన్సియర్‌గా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇటీవలే `అనగనగ` అనే చిత్రంలో సుమంత్ నటించాడు. ఈ మూవీ అతడికి నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇక ఇదే హుషారులో అతడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో సుమంత్ ఇరుగు పొరుగు భాషల్లో అవకాశాల గురించి కూడా ప్రస్థావించాడు. అయితే తాను బాలీవుడ్ లో ఆడిషన్స్ ఇచ్చినా రిజెక్ట్ అయ్యానని సుమంత్ నిజాయితీగా చెప్పారు. నాలుగైదుసార్లు ఆడిషన్స్ ఇచ్చానని అయినా తిరస్కరణకు గురయ్యానని అన్నాడు. హిందీ భాషపై పట్టు లేకపోవడం వల్లనే రిజెక్ట్ అయ్యానని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే సినీనేపథ్యం ఉండటం వల్ల తేలిగ్గా అవకాశాలు దక్కించుకుంటాము కానీ, అవన్నీ ఒక దశ వరకే. ఆ తర్వాత నటులుగా నిరూపించుకోవాల్సి ఉంటుందని సుమంత్ అన్నారు.
