యార్లగడ్డ వర్సెస్ అక్కినేని.. సుమంత్ ఏమన్నాడంటే..
సత్యం, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీ రావా లాంటి క్లాసిక్ సినిమాలతో తనకంటూ ఒక సపరేట్ ఆడియన్స్ ను క్రియేట్ చేసుకున్నారు.
By: M Prashanth | 28 July 2026 11:12 AM ISTసినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా, జనాల్లో వచ్చే గుర్తింపు దాన్ని మించిపోతుంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్ కు తన ఇంటి పేరు విషయంలో ఎప్పుడూ ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో సుమంత్ ను అక్కినేని సుమంత్ అని పిలిపించుకోవడం ఇష్టమా, లేక యార్లగడ్డ సుమంత్ అని పిలవడం ఇష్టమా అని అడిగితే ఆయన చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు. తనకు ఆ రెండు పేర్లు ఒకేలాంటి ఆనందాన్ని ఇస్తాయని క్లారిటీ ఇచ్చారు.
అభిమానులు సుమంత్ లో ఎప్పుడూ దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారి పోలికలను చూసుకుని మురిసిపోతుంటారు. బహుశా అందుకే ఆయనను బయట ఎక్కడైనా చూసినప్పుడు యార్లగడ్డ అనే తన సొంత ఇంటి పేరు కంటే కూడా, అక్కినేని సుమంత్ అని పిలవడానికే ఫ్యాన్స్ ఎక్కువ ఇష్టపడతారు. జనాలు తనను అలా పిలవడం వెనుక కారణం ఏంటో తనకు తెలుసని, రెండు పేర్లతో పిలిపించుకోవడం పట్ల తానూ హ్యాపీగానే ఫీల్ అవుతానని సుమంత్ ఆ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను పంచుకున్నారు.
నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ లాంటి స్టార్లను జనాలు వారి పేర్లతోనే ఎక్కువగా పిలుస్తుంటారు. కానీ సుమంత్ విషయంలో మాత్రం బయట ఎవరైనా సరే అక్కినేని సుమంత్ అనే ఎక్కువగా సంబోధిస్తుంటారు. ఈ పాయింట్ ను చెప్పినప్పుడు సుమంత్ కూడా కాస్త ఆశ్చర్యపోయారు. నిజంగానే బయట తనను ఆ విధంగా గుర్తిస్తున్నారు అనే విషయం తనకు కొత్తగా అనిపించిందని ఆయన సరదాగా నవ్వేశారు. తనను ఆ పేరుతో ఎక్కువగా పిలుస్తున్న ప్రేక్షకులకు ఆయన స్పెషల్ గా థాంక్స్ చెప్పారు.
నిజానికి సుమంత్ లో ఉన్న ఆ ఏఎన్నార్ పోలికల వల్లే ఆయనకు స్క్రీన్ మీద ఒక అరుదైన అవకాశం దక్కింది. నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ ఏకంగా తన తాతగారు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించి మెప్పించారు. ఆ సినిమాలో సుమంత్ ను చూసిన ప్రతి ఒక్కరూ మరో ఏఎన్నార్ అన్నంతగా ఆ క్యారెక్టర్ కు ప్రాణం పోశారు. అక్కినేని లెగసీని కంటిన్యూ చేయడంలో సుమంత్ కెరీర్ కు ఆ పాత్ర ఒక మంచి మెమోరీగా మిగిలిపోయింది.
ఇక సుమంత్ కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే మొదటి నుంచి డిఫరెంట్ గానే సాగింది. సత్యం, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీ రావా లాంటి క్లాసిక్ సినిమాలతో తనకంటూ ఒక సపరేట్ ఆడియన్స్ ను క్రియేట్ చేసుకున్నారు. అనవసరమైన కమర్షియల్ హంగుల కోసం పాకులాడకుండా, తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే కథలనే ఎంచుకుంటూ తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి కూడా నటుడిగా మంచి ప్రశంసలు అందుకున్నారు.
హీరోగానే కాకుండా కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ వస్తే వాటిని కూడా చేయడానికి సుమంత్ ఏమాత్రం వెనకాడటం లేదు. ప్రస్తుతం తన ఇమేజ్ కు తగ్గట్టుగా కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోయే సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా భాగం కాబోతున్నారు. వాటిపై కూడా త్వరలోనే అఫిషియల్ అప్డేట్స్ రానున్నాయి.
