Begin typing your search above and press return to search.

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

‘వృషకర్మ’ ప్రమోషన్లలో భాగంగా యాంకర్ సుమ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్‌లో నాగచైతన్య ఆసక్తికర సమాధానాలతో సందడి చేశారు. తండ్రి నాగార్జున కంటే భార్య శోభిత సలహాలే తీసుకుంటానని చెప్పి అందరినీ నవ్వించారు. శోభిత వంటకాలు ఇష్టమని, అఖిల్ సినిమా ముందుగా చూస్తానని కూడా వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  Madhu Reddy   |   9 Nov 2026 9:55 AM IST
ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!
X

సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య.. చివరిగా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన తాజాగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వృషకర్మ అనే చిత్రంలో నటిస్తున్నారు. పౌరాణిక అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా డిసెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అటు విడుదల తేదీకి 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇటు చిత్ర బృందం వేగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టింది.

అందులో భాగంగానే దీపావళి సందర్భంగా ప్రముఖ యాంకర్ సుమ ఇంటర్వ్యూలో వృషకర్మ టీం సందడి చేసింది. ముఖ్యంగా నాగచైతన్య, మీనాక్షి చౌదరి దీపావళి స్పెషల్ ఇంటర్వ్యూలో చాలా అందంగా కనిపించారు. ఇకపోతే ఇందులో చిత్రం గురించి పలు విషయాలను పంచుకున్న టీమ్ .. మొదట ఈ సినిమా ఫస్ట్ పాట స్వాగో అర్జునను సుమాకు చూపించి, ఆ తర్వాత రిలీజ్ చేసిన విషయం తెలిసిందే . ఇదిలా ఉండగా ఇదే ఇంటర్వ్యూలో సుమ నాగచైతన్యకి క్రాకర్స్ ఇచ్చి అది పూర్తయ్యేలోపు తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అంటూ అడిగారు..అలా ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా సుమ తన ప్రశ్నలతో చైతన్యను ఇరికించే ప్రయత్నం చేసింది కానీ ఆయన చాకచక్యంగా ఇచ్చిన సమాధానం తాలూకా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా మీనాక్షి ఇచ్చే సజెషన్స్ తీసుకుంటారా? లేక అభిమానులు ఇచ్చే సలహాలు తీసుకుంటారా? అని సుమ ప్రశ్నించగా.. నాగచైతన్య అమ్మో..అభిమానులు ఇచ్చే సలహాలు తీసుకుంటాను అంటూ నవ్వించారు. రొమాంటిక్ హీరో, యాక్షన్ హీరో ఇందులో దేనికి మీరు ప్రిఫర్ చేస్తారు అని అడగగా.. రొమాంటిక్ హీరో అని చెప్పారు. బైక్ రైడ్స్ లేదా లగ్జరీ కార్ రైడ్స్ .. ఇందులో ఏది మీకు ఇష్టం అని అడగ్గా.. తనకు బైక్ రైడ్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. షో యూ ఫుడ్ అంటే ఇష్టమా లేక శోభిత చేసిన ఫుడ్ అంటే ఇష్టమా అని ప్రశ్నించగా.. శోభిత చేసిన ఫుడ్ మాత్రమే చాలా ఇష్టమని తెలిపారు. నాగచైతన్య , అఖిల్ ఇద్దరి చిత్రాలు ఒకేసారి విడుదలయితే ముందుగా ఏది చూస్తారు అని ప్రశ్నించగా.. నా సినిమా ఎలాగో ఎడిట్ రూమ్ లో చూస్తాను కాబట్టి అఖిల్ సినిమా నే చూస్తాను అంటూ తెలిపారు.

మీ నాన్నగారి దగ్గర నుంచి అడ్వైజ్ తీసుకుంటారా? లేక ఫ్రెండ్స్ దగ్గర నుంచి అడ్వైజ్ తీసుకుంటారా? అని అడగగా.. తన తండ్రి దగ్గర నుంచి అని చెప్పారు. ఇక చివరిగా మీరు నాగార్జున దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారా? లేక శోభిత దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారా? అని నాగచైతన్యను ఇరుకున పెట్టేసింది సుమ. అయితే ఏ మాత్రం తడబడకుండా తాను శోభిత సలహాలు తీసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే ఈ వీడియో చూసిన నెటిజన్స్ శోభిత మిమ్మల్ని బాగా భయపెట్టేసిందా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ర్యాపిడ్ ఫైర్ చాలా సరదాగా సాగింది.