అది మా జీన్స్ లోనే లేదు.. రిటైర్మెంట్ పై సుమ క్లారిటీ
బుల్లితెర ప్రపంచంలో సుమ కనకాల ఓ సెన్సేషన్. సుమారు 30 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమ, 20 ఏళ్లుగా యాంకరింగ్ రంగంలో దూసుకెళ్తున్నారు
By: Sravani Lakshmi Srungarapu | 19 Nov 2025 6:55 PM ISTబుల్లితెర ప్రపంచంలో సుమ కనకాల ఓ సెన్సేషన్. సుమారు 30 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమ, 20 ఏళ్లుగా యాంకరింగ్ రంగంలో దూసుకెళ్తున్నారు. సుమ వయసు 50 ఏళ్లు పైనే అయినా అదే ఎనర్జీతో చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీతో కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఎంతో అనర్గళంగా మాట్లాడటంతో పాటూ ఆమె కామెడీ టైమింగ్ కు అందరూ సుమను తెలుగమ్మాయిలా భావిస్తారు.
సుమకు వయసు అయిపోతుందని కామెంట్స్
అయితే గత కొన్నాళ్లుగా సుమ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది. పైగా రీసెంట్ గా సీనియర్ నటి తులసి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సుమను కూడా ఆ జోన్ లోకి లాగుతూ అందరూ దీనిపై డిస్కషన్స్ చేస్తున్నారు. సుమ ఏజ్ పెరిగిపోతుందని, ఆమె తర్వాత ఆ స్థాయికి ఎవరు వస్తారనే దానిపై డిస్కషన్స్ చేస్తుంటే, కొందరు యాంకర్లు సైతం సుమకు ఎక్కువ ఛాన్సులొస్తున్నాయని, తమకు రావడం లేదని అంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
రిటైర్మెంట్ వార్తలపై రెస్పాండ్ అయిన సుమ
అయితే తన రిటైర్మెంట్ వార్తలపై రీసెంట్ గా సుమ రెస్పాండ్ అయ్యారు. సుమ స్పెషల్ రోల్ లో నటించిన ప్రేమంటే మూవీ నవంబర్ 21న రిలీజ్ కానుండగా, ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయంలో రెస్పాండ్ అయి తన రిటైర్మెంట్ గురించి మాట్లాడిన వాళ్లకు కౌంటర్ ఇవ్వడంతో పాటూ క్లారిటీ కూడా ఇచ్చారు. తన తల్లికి 81 ఏళ్ల అని, ఆమె ఇప్పటికీ చాలా యంగ్ గా ఉన్నారని, ఆమే రిటైర్మెంట్ ఇవ్వనప్పుడు తానెందుకు రిటైర్ అవాలని తిరిగి ప్రశ్నించారు సుమ.
ఇప్పట్లో రిటైర్ అయ్యే ఛాన్సే లేదు
చాలా మంది తన రిటైర్మెంట్ గురించి అడుగుతున్నారని, కానీ తన ఫ్యామిలీ జెనెటిక్స్ చాలా స్ట్రాంగ్ అని, తన అమ్మమ్మ 101 ఏళ్లు బతికారని, తన పెద్ద మామయ్యకు 99ఏళ్లు, ఇప్పటికీ ఆయన అడ్వకేట్ గా వర్క్ చేస్తున్నారని, కాబట్టి తాను ఇప్పట్లో రిటైర్ అయ్యే ఛాన్సే లేదని స్పష్టం చేశారు సుమ. తాను స్టేజ్ ఎక్కి ఏ ఈవెంట్ చేసినా ప్రతీసారీ ఆడియన్స్ నుంచి వినిపించే సుమ అక్క అనే మాట తనకు ఎంతో ఎనర్జీని ఇస్తుందని, అలాంటి ఎనర్జీ ఉన్నప్పుడు తానెలా రిటైరవుతానని ఎమోషనల్ అయ్యారు సుమ. తన రిటైర్మెంట్ గురించి సుమ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, ఆమె ఎనర్జీ చూస్తుంటే మరో పదేళ్ల పాటూ సుమ ఇదే ఎనర్జీతో తన కెరీర్ ను కొనసాగించడం ఖాయమని అర్థమవుతుంది.
