వ్వాటే పంచ్: సమంత చేసిన పూరీలు ఎలా ఉంటాయో చెప్పిన భర్త!
దశాబ్దాల పాటు తనదైన ప్రత్యేకమైన యాంకరింగ్ శైలితో.. అద్భుతమైన టైమింగ్‌తో సీనియర్ యాంకర్ సుమ కనకాల తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
By: Sivaji Kontham | 15 Jun 2026 9:20 AM ISTదశాబ్దాల పాటు తనదైన ప్రత్యేకమైన యాంకరింగ్ శైలితో.. అద్భుతమైన టైమింగ్‌తో సీనియర్ యాంకర్ సుమ కనకాల తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బుల్లితెరపై ఈ సీనియర్ యాంకర్ సందడి ఎప్పటికీ అల్టిమేట్. ఇప్పుడు సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `సుమ అండ్ చాట్ షో` సరికొత్త ఇంటర్వ్యూలతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ షోకి `మా ఇంటి బంగారం` చిత్ర బృందం విచ్చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకురాలు నందిని రెడ్డితో పాటు అన్యోన్య దంపతులు సమంత, రాజ్ పాల్గొని సందడి చేశారు. సుమ మార్క్ పంచ్‌లు...బంగారం టీమ్ కాంబినేషన్‌తో ఈ ఎపిసోడ్ అంతా నవ్వుల పువ్వులు పూయించింది.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుమ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలు, దానికి సమంత-రాజ్ జంట ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ``సమంత వర్సెస్ రాజ్ : ఎవరు ఉత్తమమో ఎవరికి తెలుసు?`` అనే టాస్క్‌లో భాగంగా సుమ వీరిద్దరితో పాటలు పాడించారు. అలాగే టెన్త్ క్లాస్‌లో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చాయి? అని సుమ ప్రశ్నించగా.. సమంత ఏమాత్రం ఆలోచించకుండా రాజ్ వైపు చూపించారు. ఇక ఏదైనా ఎమోషనల్ సీన్ చూస్తే త్వరగా ఎవరు కనెక్ట్ అయి ఏడుస్తారు? అని అడగగా.. రాజ్ వెంటనే `సమంత` వైపే చూపించారు. తాను ఏ ఏ సందర్భాల్లో అంతగా ఎమోషనల్ అవుతుందో సమంత కూడా ఈ షోలో ఓపెన్‌గా వెల్లడించారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో ఒక టాప్ హైలైట్ సీన్ ఏమిటంటే.. ``ఏదైనా ఒక మంచి జోక్ చెప్పండి`` అని సుమ రాజ్‌ను కోరగా.. అతడు ఏమాత్రం తడుముకోకుండా `సమంత చేసిన పూరీలు చాలా బావుంటాయి` అంటూ భార్య వంట గది నైపుణ్యంపై సెటైర్ వేశాడు. రాజ్ వేసిన ఈ కౌంటర్‌తో సమంతతో పాటు యాంకర్ సుమ, దర్శకురాలు నందిని రెడ్డి కూడా నవ్వులు ఆపుకోలేకపోయారు. ఇలా ఎంతో సరదాగా, హుషారుగా సాగిన ఈ ఫుల్ ఎపిసోడ్‌ను ``సుమ & చాట్ షో` యూట్యూబ్ ఛానెల్స్‌లో వీక్షించవచ్చు.
`మా ఇంటి బంగారం` విశేషాలు
ప్రస్తుతం టాలీవుడ్‌లో `మా ఇంటి బంగారం` సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లు, సింగిల్స్ ఇలా ప్రతి ఒక్క ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా తన భర్తగా రాజ్ స్క్రిప్టు పరంగా ప్రొడక్షన్ పరంగా సహకారం అందించారు. ఒక ఇంటికి కోడలిగా వెళ్లిన సమంత ఎంతో అమాయకంగా కనిపిస్తూనే.. ఆ ఇంట్లో ఒక సీక్రెట్ ఆపరేషన్‌ను ఎలా నడిపించింది? అన్న ఆసక్తికరమైన లైన్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. నటిగా సమంతలోని విలక్షణ నటనను, కామెడీ టైమింగ్‌ను ఈ సినిమా మరోస్థాయికి తీసుకెళ్లనుంది. సమంత, రాజ్‌ల మధ్య కెమిస్ట్రీ కూడా స్క్రీన్‌పై అద్భుతంగా పండబోతోందని ప్రమోషనల్ మెటీరియల్ చూస్తేనే అర్థమవుతోంది.
ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించడంలో నందిని రెడ్డి స్టైలే వేరు. ఈ సినిమాలో కూడా ఎంతో తెలివిగా.. సెన్సిబుల్ గా కథను నడిపించారని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు చక్కటి కుటుంబ విలువలని జోడించి ఈ చిత్రాన్ని మలిచారు. ప్రమోషనల్ మెటీరియల్‌తోనే సినిమాపై భారీ బజ్ పెంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా ఈ సినిమా దర్శకురాలు నందిని రెడ్డి కెరీర్‌లో ఒక బిగ్ బ్రేకింగ్ మూవీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
