25 ఏళ్ల బంధం.. విడాకులపై క్లారిటీ..
కొందరికి కొన్ని సెంటిమెంట్లు ఉండటం అనేది చాలా సహజంగా జరుగుతుంది. అలానే కొన్ని అంశాలను విపరీతంగా నమ్ముతూ ఉంటారు.
By: Madhu Reddy | 8 Nov 2025 3:51 PM ISTకొందరికి కొన్ని సెంటిమెంట్లు ఉండటం అనేది చాలా సహజంగా జరుగుతుంది. అలానే కొన్ని అంశాలను విపరీతంగా నమ్ముతూ ఉంటారు. అయితే ప్రముఖ యాంకర్ సుమ కూడా ఒక విషయాన్ని చాలా బలంగా నమ్ముతారు. రీసెంట్ గా ఒక ప్రముఖ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు సుమా కనకల.
యాంకర్ సుమకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఈవెంట్ కూడా అలవోకగా డీల్ చేస్తుంది. మామూలు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రతి ఈవెంట్ తనదైన శైలితో అల్లుకుపోయి పది మందిని ఆకర్షిస్తుంది. సుమ ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్ని విషయాల్లో సుమ మాట్లాడే విధానం చాలామందికి ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది. సాధారణంగా ఒక ఈవెంట్ కి యాంకరింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో చిన్న తప్పు చేసిన కూడా విపరీతంగా ట్రోలింగ్ జరగడం మొదలైపోతుంది. అయితే ఈ తరుణంలో కూడా సుమ తన యాంకరింగ్ ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు.
ఇకపోతే కొన్ని సందర్భాలలో సెలబ్రిటీలు వేసే ట్వీట్లు బట్టి కూడా ఏదో ఒక కథనాన్ని అల్లడం కామన్ అయిపోయింది. గతంలో చాలా సందర్భాల్లో రాజీవ్ కనకాల మరియు సుమ విడిపోయారు అని వార్తలు వచ్చాయి. కానీ ఇది ఎక్కడ అధికారికి ప్రకటన రాలేదు. చాలామంది మినిమం క్లారిటీ లేకుండా దీనిని ఆల్మోస్ట్ కన్ఫామ్ కూడా చేసేసారు.
మొత్తానికి వాటిపైన సుమా కనకాల రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. మేము ఎప్పుడు విడిపోలేదు. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడం అనేది ప్రతి బంధం లోను జరుగుతూనే ఉంటుంది. అయితే మా ఇద్దరం కలిసి వీడియోలు పెట్టినంతవరకు కూడా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కొన్ని వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది ఏంటి వీళ్లిద్దరూ ఇంకా విడిపోలేదా అని కూడా కామెంట్ చేయడం మొదలుపెట్టారు.." అంటూ సుమా క్లారిటీ ఇచ్చారు.
అలానే యాంకర్ సుమకి మరో సెంటిమెంట్ కూడా ఉందంట. తనకి ఏమైనా కలలు వస్తే అవి వాస్తవంలో జరుగుతాయని సుమా చాలా బలంగా నమ్ముతారు. ఒక తరుణంలో గుడికి వెళుతున్నట్లు కల వచ్చిందంట. అనుకోకుండా నెక్స్ట్ రోజే వాళ్ళు అదే గుడికి వెళ్లారు. అయితే ఒక సందర్భంలో రాజీవ్ కి యాక్సిడెంట్ జరిగినట్లు తన కలలో వచ్చింది. అయితే అప్పుడు రాజీవ్ షూటింగ్లో ఉండడంతో వెంటనే ఫోన్ చేసిందట. ఎంతకీ ఫోన్ తీయలేదు. మొత్తానికి రాజీవ్ కనకాల తిరిగి ఫోన్ చేసి ఏంటి విషయం అని అడిగితే ఇలా చెప్పిందట సుమ.
అవును నిజంగానే నాకు యాక్సిడెంట్ జరిగింది. నా కారు చెట్టుకి గుద్దుకుంది అంటూ చెప్పారు రాజీవ్. వెంటనే ఆ లొకేషన్ కి వెళ్ళిపోయి.. రాజీవ్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లి కట్టు కట్టించిందట సుమ. దీనిని బట్టి చూస్తే సుమ తనకు వచ్చే కలలను ఎంతలా నమ్ముతారో అర్థం చేసుకోవచ్చు.
