'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్: ఒకరు 'టీవీ' క్వీన్, మరొకరు 'యూట్యూబ్' కింగ్!
రాజమౌళి మహేష్ బాబు (SSMB29) కాంబోలో వస్తున్న 'గ్లోబ్ ట్రాటర్' నుంచి అసలైన ఫీస్ట్ రాబోతోంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈవెంట్ కోసం ఫ్యాన్స్, ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తోంది.
By: M Prashanth | 13 Nov 2025 10:00 AM ISTరాజమౌళి మహేష్ బాబు (SSMB29) కాంబోలో వస్తున్న 'గ్లోబ్ ట్రాటర్' నుంచి అసలైన ఫీస్ట్ రాబోతోంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈవెంట్ కోసం ఫ్యాన్స్, ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తోంది. ఇది నార్మల్ ప్రెస్ మీట్ కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్‌ప్లోజివ్ ఈవెంట్‌గా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన కీ వీడియో ఫుటేజ్‌ను ఒక మెగా స్క్రీన్‌పై చూపించబోతున్నారన్న వార్తతోనే హైప్ పీక్స్‌కు చేరింది.
ఈ రేంజ్ గ్లోబల్ ఈవెంట్‌కు హోస్ట్ కూడా అదే రేంజ్‌లో ఉండాలి. కానీ జక్కన్న ఒకరితో సరిపెట్టలేదు, ఏకంగా ఇద్దరు మెయిన్ హోస్ట్‌లను దించుతున్నాడు. ఈ సెలక్షన్ వెనుక రాజమౌళి పక్కా స్ట్రాటజీ కనిపిస్తోంది. ఇది కేవలం తెలుగు, హిందీ ఆడియన్స్‌ను కవర్ చేయడానికి మాత్రమే కాదు, రెండు వేర్వేరు జనరేషన్లను, రెండు వేర్వేరు మీడియాలను టార్గెట్ చేసిన ప్లాన్ ఇది.
తెలుగు ఆడియన్స్‌కు ఫ్యామిలీ మెంబర్, యాంకరింగ్ క్వీన్ సుమ కనకాలను ముందుగానే ఫిక్స్ చేశారు. టాలీవుడ్‌లో ఎంత పెద్ద ఈవెంట్ అయినా, ఆ ఈవెంట్‌కు గ్రేస్, ఫ్యామిలీ అప్పీల్ తేవాలంటే సుమ ఉండాల్సిందే. 'గ్లోబ్ ట్రాటర్' కోర్ తెలుగు మార్కెట్‌కు, ట్రెడిషనల్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవ్వడానికి సుమ పర్ఫెక్ట్ ఛాయిస్. ఆమె ఈవెంట్ 'క్లాస్' పార్ట్‌ను హ్యాండిల్ చేయబోతున్నారు.
ఇక రెండో హోస్ట్.. ఆశిష్ చంచ్లాని. ఇతను నార్మల్ యాంకర్ కాదు, ఇండియాస్ బిగ్గెస్ట్ యూట్యూబ్ స్టార్స్‌లో ఒకరు. హిందీ యూత్‌లో, డిజిటల్ వరల్డ్‌లో ఇతనికి ఉన్న ఫాలోయింగ్ కోట్లల్లో ఉంటుంది. నార్త్ ఇండియా, ముఖ్యంగా న్యూ ఏజ్ ఆడియన్స్‌ను, సోషల్ మీడియా జనరేషన్‌ను టార్గెట్ చేయడానికి ఆశిష్‌ను దించడం పక్కా 'మాస్' మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇతను ఈవెంట్ 'మాస్ యూత్' పల్స్‌ను పట్టుకోనున్నాడు.
ఈ ఇద్దరినీ ఒకే స్టేజ్ మీదకు తేవడమే జక్కన్న మాస్టర్ ప్లాన్. 'గ్లోబ్ ట్రాటర్' అనేది తెలుగు సినిమా డబ్బింగ్ ఇన్ హిందీ కాదు, ఇది మొదటి రోజు నుంచే ఒక ఇండియన్ సినిమా అని చెప్పడమే ఈ స్కెచ్. ఒకే దెబ్బకు ట్రెడిషనల్ మీడియాను, న్యూ ఏజ్ డిజిటల్ మీడియాను బ్లెండ్ చేస్తున్నారు. ఇక ఈవెంట్ రేంజ్ ఎంత పెద్దదంటే, దీన్ని గ్లోబల్‌గా 'జియోహాట్‌స్టార్' లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు.
ఈ స్ట్రీమింగ్ రైట్స్ కోసమే ఆ సంస్థ భారీ మొత్తం చెల్లించినట్టు సమాచారం. 'కుంభ' పోస్టర్, 'గ్లోబ్ ట్రాటర్' థీమ్ సాంగ్‌తో ఇప్పటికే హైప్ పెంచిన జక్కన్న నిన్న రాత్రి దీపికా యాక్షన్ లుక్ ని రిలీజ్ చేసి థ్రిల్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఈవెంట్‌తో ప్రమోషన్ల విషయంలో గట్టిగానే ఆలోచిస్తున్నారు అని ప్రూవ్ చేస్తున్నాడు. ఇది నిజంగా ఇండియన్ సినిమా ప్రమోషన్లలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోందని చెప్పవచ్చు.
