Begin typing your search above and press return to search.

సుకుమార్ రైటింగ్స్.. 10 ఏళ్ల లెక్క ఇది..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ పుష్ప మూవీ ముందు వరకు ఆయన ఒక తెలుగు స్టార్ డైరెక్టర్ మాత్రమే కానీ పుష్ప 1 అండ్ 2 తీశాక ఆయన ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు

By:  Ramesh Boddu   |   19 Sept 2025 12:04 PM IST
సుకుమార్ రైటింగ్స్.. 10 ఏళ్ల లెక్క ఇది..!
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ పుష్ప మూవీ ముందు వరకు ఆయన ఒక తెలుగు స్టార్ డైరెక్టర్ మాత్రమే కానీ పుష్ప 1 అండ్ 2 తీశాక ఆయన ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఐతే సుకుమార్ సినిమాలు డైరెక్ట్ చేయడమే కాదు ప్రొడ్యూస్ కూడా చేస్తాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సుకుమార్ సొంతంగా నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. నేటితో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ బ్యానర్ లో సినిమా అంటే పక్కా హిట్ అనే స్టాంప్ వేసుకున్నాడు సుకుమార్.

కుమారి 21 F సినిమాతో..

కుమారి 21 Fతో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఉప్పెన, విరూపాక్ష, 18 పేజెస్, పుష్ప 2, గాంధి తాత చెట్టు ఇలా వరుస సినిమాల్లో భాగ స్వామ్యం అవుతూ వచ్చింది. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ తో సుకుమార్ రైటింగ్స్ కలిసి సినిమాలు చేస్తుంటారు. వారి మధ్య బిజినెస్ వ్యవహారాలు ఎలా ఉంటాయన్నది తెలియదు కానీ సుకుమార్ రైటింగ్స్ సినిమా అంటే మైత్రి మూవీ సినిమానే అనేలా టాక్ తెచ్చుకున్నారు.

ఐతే సుకుమార్ రైటింగ్స్ ప్రత్యేకంగా సినిమాలు చేయాలని చూస్తున్నారు. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అనుకున్న సుకుమార్ ఇక మీదట తన బ్యానర్ లో కొత్త సినిమాలు చేయాలని చూస్తున్నాడు. అందుకు తగిన ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సుకుమార్ డైరెక్ట్ చేసే సినిమాలకు కూడా తన రెమ్యునరేషన్ బదులు ఆ సినిమా నిర్మాణంలో భాగం అవుతున్నాడు సుకుమార్.

చరణ్ తో పెద్ది సినిమాలో..

అలా చేయడం వల్ల సినిమా డైరెక్టర్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ గా కూడా భాగం అవుతున్నాడు. సుకుమార్ నెక్స్ట్ చాలా సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం చరణ్ తో పెద్ది సినిమాలో కూడా సుకుమార్ రైటింగ్స్ భాగ స్వామ్యం అవుతుంది. ఆ తర్వాత చరణ్ తో చేసే సుకుమార్ సొంత సినిమాకు కూడా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పనిచేస్తుంది. రెండు సినిమాలు రాం చరణ్ తో ఫిక్స్ చేసుకున్నాడు సుకుమార్.

ఇక వీరితో పాటు కొన్ని కొత్త కథలు యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ చేస్తారని తెలుస్తుంది. 10 ఏళ్లలో సుకుమార్ రైటింగ్స్ మంచి కథా బలం ఉన్న సినిమాలతో సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నారు. ఈ 10 ఏళ్ల జర్నీలో ట్రెండ్ సెట్టర్ సినిమాలతో సుకుమార్ అదరగొట్టాడు. పుష్ప 2 తర్వాత ఆయన చేసే సినిమా ఏదైనా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుంది. మరి రాబోతున్న సినిమాలతో సుకుమార్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడన్నది చూడాలి.