Begin typing your search above and press return to search.

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న మ‌రో చిత్రం `ఆర్సీ 17`.

By:  Srikanth Kontham   |   3 Nov 2026 7:00 PM IST
ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న మ‌రో చిత్రం `ఆర్సీ 17`. `రంగస్థలం` హిట్ తర్వాత ఇద్ద‌రి కలయికలో రూపొందుతున్న‌ పాన్-ఇండియా ప్రాజెక్టుపై తొలి నుంచీ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల గ్రాండ్‌గా లాంచ్ అయిన సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఎంపిక విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొన‌సాగ‌డం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

`ఆర్సీ 17` హీరోయిన్ విషయంలో సుకుమార్ ఇంకా క్లారిటీ కి రాలేదు. సాధారణంగా కథానాయికల పాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సుకుమార్ చిత్రంలోనూ హీరోయిన్ క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తున్నారట. ఆ పాత్రకు సంబంధించి మరింత మెరుగైన ఔట్‌పుట్ కోసం స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఓ కొత్త వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

కథలో భావోద్వేగాలు, చరణ్ పాత్రతో ఆ క్యారెక్టర్‌కు ఉండే కెమిస్ట్రీని దృష్టిలో ఉంచుకుని సుకుమార్ హీరోయిన్ రోల్‌ను నిశితంగా చెక్కుతున్నారు. ఆ పాత్ర స్వభావం, నటనకు ఉన్న ప్రాధాన్యం రీత్యా స్క్రిప్ట్ వర్క్ ఇంకా కొలిక్కి రాకపోవడమే ఎంపిక ఆలస్యమవడానికి ప్రధాన కారణమని సమాచారం. గ్లామర్ కోసమే కాకుండా పర్ఫార్మెన్స్ పరం గానూ ప్రేక్షకులను మెప్పించే నటి కావాలని పట్టు బడుతున్నారట.

గతంలో బాలీవుడ్ భామలతో పాటు పలువురు టాప్ హీరోయిన్ల పేర్లు ఈ ప్రాజెక్ట్ చుట్టూ వినిపించినా? సుకుమార్ రాస్తున్న కొత్త వెర్షన్ పూర్తయిన తర్వాతే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కథలో ఆ పాత్ర పూర్తిగా రూపుదిద్దుకున్నాకే నాయికను ఫైనల్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారుట‌. ఈ నేప‌థ్యంలో ఎలాంటి రూమర్స్ వైర‌ల్ అవుతున్నాయి? టీమ్ మాత్రం తొందరపడకుండా సరైన ఛాయిస్ కోసం వేచి చూస్తోంది.

ఏది ఏమైనా పర్ఫెక్ట్ విజన్ కోసం ఏ విషయంలోనూ రాజీపడని సుకుమార్ కొత్త వెర్షన్ కథనంతో మరోసారి బిగ్ స్క్రీన్‌పై అద్భుతాన్ని ఆవిష్కరించడం ఖాయమనిపిస్తోంది. హీరోయిన్ ఎంపిక ఆల‌స్య‌మైనా? రాబోయే ప్రాజెక్ట్ ఔట్‌పుట్ మాత్రం అభిమానులకు విందుగా మారుతుందన‌డంలో సందేహం లేదు. త్వరలోనే ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ అప్‌డేట్ ఇచ్చే అవకాశం ఉంది.