కింగ్ డమ్ పై సుకుమార్ రియాక్షన్ ఏంటంటే..?
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాపై ఆడియన్స్ నుంచి వచ్చిన రియాక్షన్ తెలిసిందే.
By: Ramesh Boddu | 3 Aug 2025 2:31 PM ISTవిజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాపై ఆడియన్స్ నుంచి వచ్చిన రియాక్షన్ తెలిసిందే. ఐతే ఈ సినిమాకు సెలబ్రిటీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సినిమా చూసిన సుకుమార్ తనకు కాల్ చేసి మాట్లాడారని అన్నారు. ఆయనకు సినిమా బాగా నచ్చిందని చెప్పారని విజయ్ వెల్లడించాడు. సుకుమార్ సార్ కి కథ నచ్చడం అన్నది చాలా మంచి విషయమని అన్నాడు విజయ్ దేవరకొండ.
రాహుల్ సంకృత్యన్ తో చేస్తున్న సినిమా..
ఐతే కింగ్ డమ్ సినిమా ఫ్యాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కి తాను చాలా హ్యాపీగా ఉన్నానని అన్నారు విజయ్ దేవరకొండ. కొన్నాళ్లుగా వాళ్లు నా నుంచి ఆశిస్తున్న సినిమా ఇవ్వలేదని. కింగ్ డమ్ తో అది నెరవేరిందని చెప్పారు. ఐతే వేరే ఇంటర్వ్యూలో ఈ సినిమాలో తనకు ఎలివేషన్స్ ప్రత్యేకంగా ఇవ్వలేదని.. సినిమాకు ఎంత అవసరమో ఆ రోల్ కి ఇచ్చారని అన్నాడు. ఐతే కింగ్ డమ్ కాదు కానీ రాహుల్ సంకృత్యన్ తో చేస్తున్న సినిమాలో తనకు భారీ ఎలివేషన్స్ ఉంటాయని అన్నాడు విజయ్ దేవరకొండ.
కింగ్ డమ్ సినిమా కోసం విజయ్ బాగానే కష్టపడ్డాడు. రాహుల్ సంకృత్యన్ తో విజయ్ దేవరకొండ ఆల్రెడీ టాక్సీవాలా తీసి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు మళ్లీ నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమా పీరియాడికల్ యాక్షన్ మూవీగా వస్తుందట. ఈ సినిమా బాహుబలి తరహాలో భారీ కాన్వాస్ తో వస్తుందని తెలుస్తుంది.
ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ పడితే మాత్రం..
కింగ్ డమ్ సినిమా రిజల్ట్ ఏదైనా విజయ్ దేవరకొండ మాస్ స్టామినా అయితే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ పడితే మాత్రం విజయ్ కాలిబర్ ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్ధన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ రాయలసీమ కుర్రాడిగా కనిపించనున్నాడు. తప్పకుండా ఈ సినిమాతో మరో మాస్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు విజయ్. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. రాహుల్ సంకృత్యన్ మూవీలో మాత్రం రష్మికని తీసుకున్నట్టు తెలుస్తుంది. రాబోతున్న రెండు ప్రాజెక్ట్ లు కూడా చాలా క్రేజీగా ఉండనున్నాయి.
