'రంగస్థలం' చిట్టి బాబును..'పుష్ప' పుష్పరాజ్‌ను మించేలా..!
సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం, పుష్ప చిత్రాల్లో హీరోల పాత్రల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు RC17లో రామ్ చరణ్‌ను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి పెరుగుతోంది. ప్రీ లుక్‌లోని నెమలి పింఛం ఆధారంగా చరణ్ పాత్రపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిట్టిబాబు, పుష్పరాజ్‌లను మించే క్యారెక్టరైజేషన్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
By: Sivaji Kontham | 10 Nov 2026 9:21 AM ISTపాన్ ఇండియా రేసింగ్ లో దర్శకుడు సుకుమార్ స్థానం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలిసిందే. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో రూ.2000 కోట్ల వసూళ్ల క్లబ్ ని అందుకున్నాడు సుక్కూ. భారతదేశంలో దిగ్గజ దర్శకులుగా చెప్పుకునే చాలా మంది స్టార్ డైరెక్టర్లు ఈ ఫీట్ ని ఇంకా సాధించలేదు. రాజమౌళి, నితీష్ తివారీ లాంటి వారికి ఇలాంటి అరుదైన అవకాశం లభించింది.
అందుకే ఇప్పుడు సుకుమార్ తెరకెక్కించే సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది ట్రేడ్ లోను సుక్కూ తన తదుపరి చిత్రంలో కథానాయకుడిని ఎలా చూపించబోతున్నాడు? అన్నది ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. అతడు పాత్రలను సరికొత్తగా తీర్చిదిద్దే విధానం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రంగస్థలంలో చెవులు వినిపించని(చెవిటి) చిట్టి బాబును.. పుష్పలో గూని వంచే ఊరమాస్ పుష్పరాజ్ ని చూపించిన సుకుమార్ ఆ రెండు పాత్రల ఆహార్యాన్ని అంతకుముందు ఎన్నడూ చూడని విధంగా చూపించారు. సుక్కూ ఎంపిక చేసుకున్న పాత్రలు ఎంతో రియలిస్టిక్ గా, నేచురల్ గా, ప్రజలు రెగ్యులర్ గా చూసేవిగా కనిపిస్తూనే, గమ్మత్తయిన ఆహార్యంతో అలరించాయి.
రంగస్థలంలో గోదారి కుర్రాడిగా చరణ్‌ను చూపించిన తీరును ఇప్పటికీ మర్చిపోలేరు. ఇక గంధపు చెక్కల స్మగ్లర్ గా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్ స్టార్ ని అతడు పెద్ద తెరపై ఆవిష్కరించిన తీరు గురించి చాలా చర్చ సాగుతూనే ఉంది. టాలీవుడ్ కి ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ అవార్డ్ తేగలిగిన ప్రతిభ సుకుమార్ సొంతం.
అందుకే ఇప్పుడు రామ్ చరణ్ ని ఆర్.సి 17లో ఎలా చూపింబోతున్నాడు? అన్నది ఆసక్తిగా మారింది. రంగస్థలం లో చిట్టిబాబు పాత్రతో చరణ్ ని అంతకుముందు ఉన్న ఇమేజ్ చట్రం నుంచి బయటకు తెచ్చాడు. కేవలం మాస్ యాక్షన్ హీరోగానే కాదు.. నటుడిగాను అతడిలోని బెస్ట్ ఏంటో చూపించాడు. చిట్టిబాబుగా చరణ్ నటనకు జాతీయ అవార్డ్ రావాల్సింది. రకరకాల కారణాలతో పురస్కారం దక్కలేదనే చర్చ తెలుగు మీడియాలో ఇప్పటికీ సాగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు ఆర్.సి 17లో చరణ్ ని సుక్కూ ఎలా చూపించబోతున్నారు? అన్న చర్చ అంతకంతకు వేడెక్కిస్తోంది.
ఇప్పటివరకు RC17లో చరణ్ పాత్రకు సంబంధించి చిన్న లీక్ కూడా బయటకు రాకుండా సుకుమార్ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గతంలో విడుదల చేసిన ప్రీ-లుక్ పోస్టర్‌లో కనిపించిన నెమలి పింఛం ఆధారంగా చరణ్ ఈ సినిమాలో గోపీ కృష్ణుడు లేదా ఒక భిన్నమైన రెబెల్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తాడనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. చిట్టిబాబును, పుష్పరాజ్ ను దాటుకుని వెళ్లే స్థాయి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడం సుకుమార్‌కు పెద్ద సవాలే అయినా.. అతడి మార్క్ మేకింగ్ తప్పకుండా మరో బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్‌ని ఇస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ తన కెరీర్ లో మర్చిపోలేని మరో అద్భుతమైన పాత్రలో నటిస్తున్నాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఆర్.సి 17 నుంచి చరణ్ లుక్ విడుదలైతే కానీ ఈ పాత్ర ఎలాంటిదో ఇంకా ఊహించలేము.
