రోమియో జూలియెట్..కృష్ణ రాధా..మహేష్ నమ్రత!
అయితే ఇందులో ముందు హీరోయిన్ సమంత కాదు. ఆ అవకాశం ముందు వరించింది అనుపమ పరమేశ్వరన్‌నే.
By: Tupaki Entertainment Desk | 11 Feb 2026 2:10 PM ISTచరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నరోమియో జూలియెట్, రాధా కృష్ణల ప్రేమ గాధ గురించి తెలియని వారుండరు. ఒకరి కోసమే ఒకరు పుట్టారా? అనేంతగా వీరి ప్రేమకథలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అజరామరం. అయితే వీరి తరహాలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు, సమ్రతల జోడీ అంటోంది క్రేజీ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. మలయాళ మూవీ `ప్రేమమ్`తో మేరీ జార్జ్‌గా మెరిసి యూత్‌ని ఆకట్టుకున్న అనుపమ స్టార్ హీరోయిన్ రేసులో వెనుకబడింది. `రంగస్థలం` వదులుకుని కెరీర్‌లో బిగ్ బ్లండర్ మిస్టేక్ చేసిన అనుపమ ఇప్పటికీ స్టార్ జాబితాలో చేరలేకపోతోంది.
ఈ ఏడాది తమిళ మూవీ `లాక్‌డౌన్`తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏ.ఆర్.జీవా డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓ పోడ్ కాస్ట్‌లో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్ మహేష్, నమ్రతల జోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఆకట్టుకుంటోంది. రినౌన్ త్రీ పాపులర్ కపుల్ గురించి చెప్పమంటే అనుపమ పరమేశ్వరన్ ఆసక్తికరమైన జోడీల గురించి చెప్పుకొచ్చింది. రోమియో జూలియెట్.. రాధాకృష్ణ.. అని చెబుతూ మూడవ జంటగా మహేష్ నమ్రతల పేర్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది.
మహేష్‌తో కలిసి అనుపమ ఇంత వరకు ఏ సినిమా చేయలేదు. భవష్యత్తులో ఆ అవకాశం రావాలని అలా మహేష్ జంటని మెన్షన్ చేసిందో లేక యాక్సిడెంటల్‌గా చెప్పిందో కానీ ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే చేజేతులా పోగొట్టుకున్న క్రేజీ అవకాశం మళ్లీ అనుపమ పరమేశ్వరన్‌ను వెతుక్కుంటూ వచ్చినట్టుగా తెలుస్తోంది. వివారాల్లోకి వెళితే..గత కొన్నేళ్ల క్రితం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్‌ల కలయికలో తెరకెక్కిన మూవీ `రంగస్థలం`. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.
అయితే ఇందులో ముందు హీరోయిన్ సమంత కాదు. ఆ అవకాశం ముందు వరించింది అనుపమ పరమేశ్వరన్‌నే. అయితే ఆ టైమ్‌లో తనని వెతుక్కుంటూ వచ్చిన భారీ ఆఫర్‌ని, కెరీర్ టర్నింగ్ ఛాన్స్‌ని డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల అనుపమ పరమేశ్వరన్ చేజేతులా వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఈ సినిమా ఏ స్థాయి బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో, రామ్ చరణ్‌కు నటుడిగా ఎలాంటి గుర్తింపుని తెచ్చి పెట్టిందో తెలిసిందే. అయితే ఈ మూవీ తరువాత కొంత విరామం తీసుకున్న ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పని చేయబోతోంది.
పుష్ప, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్‌గా సంచలనం సృష్టించిన సుకుమార్ త్వరలో రామ్ చరణ్‌తో అంతకు మించిన మాస్ మసాయా యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇందులో ఓ హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించే అవకాశం ఉందని తెలిసింది. అప్పుడు మిస్సయిన ఆఫర్ ఇప్పుడు తిరిగి తలుపుతడుతుండటంతో ఈ భారీ ప్రాజెక్ట్‌తో హీరోయిన్‌గా అనుపమ కెరీర్ టర్న్ కావడం ఖాయమని అంతా అంటున్నారు.
