Begin typing your search above and press return to search.

చరణ్ తర్వాత సుక్కు ప్లాన్ ఏంటి..?

ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే సుకుమార్ సినిమాకు రెడీ అనేస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   10 Nov 2025 2:23 PM IST
చరణ్ తర్వాత సుక్కు ప్లాన్ ఏంటి..?
X

పుష్ప 2 తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తోనే సినిమా చేస్తాడన్న అప్డేట్ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ తోనే చరణ్ హీరోగా సుకుమార్ తో మరో సినిమా రాబోతుంది. రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అవుతుందని తెలియగానే మెగా ఫ్యాన్స్ లో అంచనాలు మొదలయ్యాయి. ఐతే పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు సుకుమార్. పుష్ప 2 చివర్లో పార్ట్ 3 ఉంటుందని అనౌన్స్ చేశారు. పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడు అన్నది తెలియట్లేదు. ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే సుకుమార్ సినిమాకు రెడీ అనేస్తున్నాడు.

అల్లు అర్జున్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు పుష్ప 3..

సుకుమార్ కూడా చరణ్ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ నుంచి మొదలు పెట్టే ప్లానింగ్ లో ఉన్నాడు. ఐతే చరణ్ తర్వాత సుకుమార్ లిస్ట్ లో ఎవరు ఉన్నారన్నది సస్పెన్స్ గా ఉంది. పుష్ప 3 ముందు వెనక అయినా చేస్తారు. అల్లు అర్జున్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు పుష్ప 3 చేసే ఛాన్స్ ఉంది. ఐతే సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా ఒకటి అనౌన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న క్లారిటీ రాలేదు. మరోపక్క ప్రభాస్ తో సుకుమార్ సినిమా ఒకటి ప్లానింగ్ ఉందని టాక్.

ఐతే మహేష్ తో కూడా సుకుమార్ ఒక సినిమా చేసే ప్లాన్ ఉందట. ఆల్రెడీ 1 నేనొక్కడినే సినిమాతో ఈ కాంబో కలిసి పనిచేశారు. కానీ అది వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఈసారి ఒక భారీ ప్రాజెక్ట్ తో ఈ సినిమా చేస్తారని తెలుస్తుంది. సుకుమార్ చేస్తా అనాలే కానీ స్టార్ హీరోలు అంతా కూడా రెడీ అనేస్తారు. సుకుమార్ కూడా నెక్స్ట్ సినిమాల విషయంలో అంచనాలకు తగినట్టుగా ప్లాన్ చేస్తున్నారట.

సుక్కు సినిమా అంటే చాలు ఇప్పుడు నేషనల్ వైడ్..

సుక్కు సినిమా అంటే చాలు ఇప్పుడు నేషనల్ వైడ్ ఆడియన్స్ కూడా అంచనాలు ఏర్పరచుకుంటున్నారు. పుష్ప 1 అండ్ 2 సినిమాలతో సుకుమార్ ఏర్పరచిన ఇంపాక్ట్ అలాంటిది. సో పుష్ప 3 తో పాటు చరణ్ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి సుకుమార్ రాబోతున్న రోజుల్లో ఆడియన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చే సినిమాలు చేసేలా అడుగు వేస్తున్నాడని అంటున్నారు.

ఇక మీదట సుకుమార్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో అదరగొట్టే ఛాన్స్ ఉంది. చరణ్, మహేష్ లతో పాటు స్టార్ సినిమాల ప్లానింగ్ తో సుక్కు మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఫిక్స్ అంటున్నారు. ఈ కాంబినేషన్ లు.. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఫ్యాన్స్ కి కచ్చితంగా ఒక విజువల్ ట్రీట్ ఇచ్చేయడం పక్కా అనేలా ఉన్నాయి.