అల్లు (Vs) సుక్కూ: ఐకాన్‌స్టార్‌తో `పుష్ప-3` ఛాలెంజ్‌ని స్వీకరిస్తారా?
‘ఆకాశంలో ఒక తార’ సినిమా విషయంలో అల్లు అరవింద్ విసిరిన ఛాలెంజ్‌లో దర్శకుడు సుకుమార్ ఓడిపోయారు. సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఒప్పందం ప్రకారం అరవింద్‌కు రూ.లక్ష చెక్కు ఇచ్చారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి నటించిన ఈ చిత్రం తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
By: Sivaji Kontham | 29 Nov 2026 10:59 AM ISTటాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ - స్టార్ డైరెక్టర్ సుకుమార్ మధ్య గురు శిష్య బంధం, రిలేషన్ షిప్ గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యా ఒక ఛాలెంజ్ టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చగా మారింది. ``నువ్వు థియేటర్ లోంచి ఏడ్వకుండా వస్తే నీకు కోటి ఇస్తాను. ఏడిస్తే నువ్వు నాకు లక్ష చెల్లిస్తే చాలు!`` అంటూ అల్లు అరవింద్ `ఆకాశంలో ఒక తార` సినిమా గురించి ఛాలెంజ్ విసిరారు. దానికి సుకుమార్ వెంటనే స్పందిస్తూ ఒక లక్ష చెక్ ని రాసి రెడీగా ఉంచిన ఒక ఫోటోగ్రాఫ్ ని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చే యడంతో అది కాస్తా వైరల్ గా మారింది. గురుశిష్యుల ఛాలెంజ్ బావుంది. సుక్కూ రిప్లయ్ కూడా అంతే ఛాలెంజింగ్ గా ఉంది. అయితే సుకుమార్ ఈ ఛాలెంజ్ లో నెగ్గాడా లేదా? అనేది తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాలి.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సినిమా ప్రమోషన్లలో ఎప్పుడూ వినూత్న పంథా అనుసరిస్తూ సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతుంటారు. తాజాగా దుల్కర్ సల్మాన్, కొత్త నటి సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఫిక్షనల్ సోషల్ డ్రామా `ఆకాశంలో ఒక తార` చిత్రానికి సంబంధించి `పుష్ప` దర్శకుడు సుకుమార్కు విసిరిన పందెం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రాన్ని చూస్తూ.. కంట నీరు పెట్టకుండా థియేటర్ నుంచి బయటకు వస్తే రూ. కోటి ఇస్తానని అరవింద్ సవాల్ విసిరారు. అయితే ఈ ఛాలెంజ్‌లో సుకుమార్ ఓడిపోయారు.
సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలకు సుకుమార్ చలించిపోయి కన్నీళ్లు పెట్టుకోవడంతో.. పందెం నిబంధన ప్రకారం ఆయన అల్లు అరవింద్‌కు రూ. లక్ష చెక్కు రాసిచ్చారు. అరవింద్ గారి నుంచి ఫోన్ వచ్చిందని చెప్పిన సుక్కూ... `ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా బయటకు వస్తే రూ. కోటి ఇస్తాను, లేదంటే నువ్వు నాకు రూ. లక్ష ఇవ్వాలి అన్నారు. ఎంత ఖరీదైన సిఫార్సు సార్ ఇది`` అంటూ సుకుమార్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
వ్యోమగామి కావాలని కలలు కనే ఒక సాధారణ యువతి జీవితంలోకి ప్రవేశించిన మెకానిక్ ఆమెకు ఎలాంటి సహాయం అందించాడనేదే ఈ సినిమా కథాంశం. గుణ్ణం గంగరాజు వంటి ప్రముఖ రచయిత ఈ చిత్రానికి కథను అందించగా, పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. నవంబర్ 20న ధనుష్, మమ్ముట్టి నటించిన `ఓం: ఆపరేషన్ మోల్` వంటి భారీ చిత్రంతో పోటీగా విడుదలైనా.. పాజిటివ్ మౌత్ టాక్‌తో తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 51 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మరోవైపు అల్లు అరవింద్, సుకుమార్ తమ తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి (రష్మిక టైటిల్ పాత్రధారి) బయోపిక్ `ఎం.ఎస్ - ఏ లెగసీ ఆన్ స్క్రీన్` చిత్రాన్ని అరవింద్ నిర్మిస్తుండగా 2027-28కి మరిన్ని భారీ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇక `రంగస్థలం` తర్వాత రామ్ చరణ్‌తో మరో భారీ చిత్రాన్ని ఇటీవలే సుకుమార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప- 3` ఎప్పుడు పట్టాలెక్కుతుందో అరవింద్ తో సుకుమార్ ఛాలెంజ్ విసరాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. పుష్ప, పుష్ప2 చిత్రాలతో సంచలనాలు సృష్టించిన ఈ జోడీ పుష్ప 3 తో మరోసారి బాక్సాఫీస్ రికార్డుల వేట కోసం ఛాలెంజ్ లు విసురుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
