Begin typing your search above and press return to search.

వేణు.. ఈ మ్యాటర్ లో సుకుమార్ కంటే గ్రేటే..

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా చూడాలని ఫ్యాన్స్‌తో పాటు దర్శకుడు సుకుమార్ కూడా గతంలో చాలా ప్రయత్నాలు చేశారు.

By:  M Prashanth   |   20 Jan 2026 9:32 AM IST
వేణు.. ఈ మ్యాటర్ లో సుకుమార్ కంటే గ్రేటే..
X

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా చూడాలని ఫ్యాన్స్‌తో పాటు దర్శకుడు సుకుమార్ కూడా గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. సుకుమార్ మొదటి సినిమా 'ఆర్య' నుంచి మొన్నటి 'పుష్ప' వరకు వీరిద్దరి మధ్య 20 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. నేషనల్ లెవల్‌లో హిట్ కొట్టిన ఈ కాంబినేషన్‌లో DSP ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని సుకుమార్ అనుకున్నా అది కుదరలేదు.

సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ మిస్ చేసిన ఆ మ్యాజిక్‌ను ఇప్పుడు 'బలగం' వేణు సాధ్యం చేస్తున్నారు. కేవలం ఒక్క సినిమా అనుభవమున్న వేణు యల్దెండి, దేవిశ్రీని ఒప్పించడం వెనుక ఒక పెద్ద అన్వేషణే ఉంది. లేటెస్ట్ గా వేణు సోషల్ మీడియాలో షేర్ చేసిన 8 గంటల చర్చల ఫోటో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా కథ నచ్చకపోతే అరగంటలోనో లేదా మహా అయితే రెండు మూడు గంటల్లోనో మేటర్ క్లోజ్ అవుతుంది. కానీ మొదటి మీటింగ్ లోనే ఏకంగా 8 గంటలు గడిచాయంటే, వేణు విజన్ దేవిశ్రీకి ఏ రేంజ్‌లో కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సుదీర్ఘ చర్చలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. 'పర్షి' అనే రగ్గడ్ పాత్రలోకి దేవిశ్రీని తీసుకెళ్లడంలో ఇవి బాగా హెల్ప్ అయ్యాయి.

సుకుమార్ లాంటి అగ్ర దర్శకులతో ట్రాక్ రికార్డ్ ఉన్న డిఎస్‌పి, వేణు చెప్పిన కథకు అంత టైమ్ ఇచ్చారంటే ఆ స్క్రిప్ట్‌లో ఎంత డెప్త్ ఉందో ఊహించవచ్చు. దేవిశ్రీ తన 20 ఏళ్ల మ్యూజిక్ అనుభవాన్ని పక్కన పెట్టి, వేణు క్రియేట్ చేసిన 'ఎల్లమ్మ' ప్రపంచంలోకి పూర్తిగా వెళ్లిపోయారని ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. జానపద విశ్వాసాలు, ఆధ్యాత్మిక అంశాలతో ఉన్న ఈ 'ఎల్లమ్మ' గ్లింప్స్ మేకింగ్ క్వాలిటీని ఇప్పటికే నిరూపించింది.

దిల్‌ రాజు లాంటి సీనియర్ నిర్మాత ఉండడం వల్ల సినిమా రేంజ్ మరింత పెరిగింది. వేణు తన అన్వేషణను మూడేళ్ల పాటు సాగించి, చివరకు దేవిశ్రీ లాంటి ఎనర్జిటిక్ పర్సనాలిటీని ఒక ఇంటెన్స్ రోల్‌లోకి తీసుకురావడం విశేషం. ఫైనల్ గా సుకుమార్ ఎప్పుడో చేయాలనుకున్న పనిని వేణు ఇప్పుడు తన విజన్‌తో పూర్తి చేస్తున్నారు. ఫస్ట్ మీటింగ్ లోనే 8 గంటల పాటు చర్చించారంటే, అది కేవలం నటుడికి దర్శకుడు చెప్పిన కథ కాదు.. ఇద్దరు క్రియేటివ్ టెక్నీషియన్ల మధ్య కుదిరిన పక్కా సింక్ అని చెప్పవచ్చు. మరి ఈ 'ఎల్లమ్మ' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.