Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్ కి 15 కండిషన్స్ పెట్టిన యంగ్ బ్యూటీ.. ఇదెక్కడి విడ్డూరం!

టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా, సోషల్ మీడియా ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్న సరికొత్త చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయింది.

By:  Madhu Reddy   |   25 Jun 2026 5:27 PM IST
ప్రొడ్యూసర్ కి 15 కండిషన్స్ పెట్టిన యంగ్ బ్యూటీ.. ఇదెక్కడి విడ్డూరం!
X

టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా, సోషల్ మీడియా ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్న సరికొత్త చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ సినిమాకు 'ఇడుపు కాయితం' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గెస్ట్‌గా వచ్చి టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. అయితే, ఈ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ బన్నీ వాస్ తన హీరోయిన్ నాగదుర్గ గురించి చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

నాగదుర్గ పెట్టిన 15 రూల్స్:

సినిమా ఓపెనింగ్స్ వేడుకలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ హీరోయిన్ నాగదుర్గ గురించి ఒక క్రేజీ సీక్రెట్ బయటపెట్టారు. "ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయాలని నాగదుర్గను సంప్రదించగానే, ఆమె ఓకే చెప్పడానికి ముందు నాకు ఏకంగా 15 కండిషన్స్ పెట్టింది. ఇక ఆ రూల్స్ అన్నీ విన్నాక నేనేం అప్సెట్ అవ్వలేదు, పైగా చాలా ఆనందించాను. ఒక తెలుగు అమ్మాయి తన కెరీర్ విషయంలో, చేసే క్యారెక్టర్ విషయంలో ఎంత క్లారిటీగా ఉందో చూసి నాకు ముచ్చటేసింది. అప్పుడే నాకు అర్థమైంది.. నేను మాట్లాడుతోంది పక్కా క్లారిటీ ఉన్న ఒక తెలుగు అమ్మాయితో అని" అంటూ బన్నీ వాస్ సర్ప్రైజ్ అయ్యారు.

సిల్వర్ స్క్రీన్ రికార్డులపై కన్ను:

యూట్యూబ్, సోషల్ మీడియాలో తెలంగాణ జానపద పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్‌ ద్వారా నాగదుర్గకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆమె చేసిన ప్రతి ఫోక్ సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి రికార్డులు సృష్టించింది. ఇక డాన్స్‌లో ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌ను షేక్ చేసిన నాగదుర్గ, ఇప్పుడు 'ఇడుపు కాయితం' సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద కూడా దూసుకుపోవాలని రెడీ అవుతోంది.

నాగదుర్గ కోసం స్పెషల్ ఫోక్ సాంగ్:

నాగదుర్గకు ఉన్న క్రేజ్, డాన్స్ టాలెంట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలో ఆమె కోసం ఒక స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేయిస్తున్నట్లు బన్నీ వాస్ ప్రకటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ రూరల్ తెలంగాణ ఫ్యామిలీ డ్రామాను యంగ్ డైరెక్టర్ వంశీ రెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్నారు. ఇక ఖచ్చితంగా ఈ పాట థియేటర్లలో ఆడియన్స్‌తో ఈలలు వేయించడం ఖాయమని చిత్ర యూనిట్ నమ్ముతోంది.

చిన్న స్క్రీన్ పైన జానపద నృత్యాలతో అలరించిన నాగదుర్గ, పెద్ద స్క్రీన్ పై ప్రియదర్శి లాంటి నటుడి పక్కన హీరోయిన్‌గా అడుగుపెట్టడం విశేషం. అటు గ్లామర్ ఇండస్ట్రీలోకి వస్తూనే, తనకంటూ కొన్ని పక్కా రూల్స్ పెట్టుకుని క్రమశిక్షణతో అడుగుపెడుతున్న నాగదుర్గను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి ఈ 'ఇడుపు కాయితం' సినిమాతో నాగదుర్గ వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.