ప్రోత్సహించడంలోనూ గురు శిష్యులు ముందే!
టాలీవుడ్ ఉత్తమ గురు శిష్యులు సుకుమార్-బుచ్చిబాబు గురించి చెప్పాల్సిన పనిలేదు. దర్శకులుగా ఇద్దరి ప్రయాణం దేదీప్యమానంగా సాగిపోతుంది.
By: Srikanth Kontham | 19 Dec 2025 5:00 PM ISTటాలీవుడ్ ఉత్తమ గురు శిష్యులు సుకుమార్-బుచ్చిబాబు గురించి చెప్పాల్సిన పనిలేదు. దర్శకులుగా ఇద్దరి ప్రయాణం దేదీప్యమానంగా సాగిపోతుంది. ఇరువురు పాన్ ఇండియా స్టార్లతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కోట్ల రూపాయలు పారితోషికం..సినిమాలో లాభాలు తీసుకుంటారు. ఇద్దరి కెరీర్ పరంగా ఇంకొంత కాలం తిరుగులేదు. వాళ్ల జమానా మరికొంత కాలం సాగుతుంది. అయితే వీరిద్దరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఉత్తమ గురుశిష్యులు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. సుకుమార్ డైరెక్టర్ అవ్వడానికి ఎంతో కష్టపడ్డాడు. కానీ బుచ్చిబాబు కి అన్ని కష్టాలు లేవు.
ఎదిగినా ఒదిగిన వారు:
అసిస్టెంట్ అవ్వడం నుంచి డైరెక్టర్ గా ప్రమోట్ అవ్వడం వరకూ ఈజీగానే జరిగింది. ఆ తర్వాత ట్యాలెంట్ తో పైకొచ్చాడు. ఇప్పుడీ గురు శిష్యులిద్దరు నవతరం ప్రతిభావంతుల్ని అంతే విధిగా ప్రోత్సహించడం విశేషం. సాధారణంగా ఓ స్టేజ్ కి వెళ్లిన తర్వాత...స్టేచర్ వచ్చిన తర్వాత ఎక్కిన మెట్లు మర్చిపోవడం అన్నది చాలా మంది విషయంలో జరుగుతుంది. కానీ సుకుమార్-బుచ్చిబాబు మాత్రం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండేవారని తమ ప్రవర్తనతో ప్రతీసారి ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఇండస్ట్రీ కి వచ్చే కొత్త వారిని ప్రోత్సహించడంలో ముందుంటారు.
లక్షల రూపాయల ఉచిత ప్రచారం:
కొత్త సినిమా ప్రచారానికి తమ వంతు సహకారం అందిస్తుంటారు. చిన్న దర్శక, నిర్మాతలు ఎవరైనా? తమ సినిమా టీజర్, ట్రైలర్ లాంటివి లాంచ్ చేయాలని అడగగానే కాదనకుండా వెంటనే ఆ పని చేసి పెడతారు. అందుబాటులో ఉంటే లైవ్ ఈవెంట్లకు కూడా హాజరవుతుంటారు. సుకుమార్ బిజీగా ఉన్నా? బుచ్చిబాబు మాత్రం ఆహ్వానిస్తే కాదనకుండా అటెండ్ అవుతుంటాడు. అలా చేయడం వల్ల ఆ సినిమాకు లక్షల రూపాయల పబ్లిసిటీ ఉచితంగా దొరికినట్లే. కొంత మంది ఈ పని చేయడానికి కూడా ఛార్జ్ చేస్తుంటారు? అనే అరోపణలు టాలీవుడ్ డైరెక్టర్లలలో కొందరిపై ఉన్నాయి.
బీ పాజిటివ్..అంతా సంతోషమే:
తమ ఇమేజ్ ను ప్రచారం కోసం అలా వాడుకుంటారు? అన్నది ఫిలిం సర్కిల్స్ లో ఎప్పుడూ చర్చకొచ్చే అంశం. కానీ సుకుమార్-బుచ్చిబాబులపై ఇంత వరకూ అలాంటి రూమర్లు ఎప్పుడూ రాలేదు. రావు కూడా అన్నది అంతే వాస్తవం. ఇద్దరు ఎంతో జెన్యూన్ గా ఉంటారు. ఓపెన్ గా మాడుతారు. తమతో పాటు తమ చుట్టూ పక్కల వారు కూడా పైకి రావాలి? అని పాజిటివ్ గా ఆలోచించే మనస్తత్వాలు. ఎదిగితుంటే? చూసి ఓర్వలేని కుళ్లు, కుతంత్రాలు చేసే తత్వాలు గల వారు కాదు. మనిషి ఎంత పాజిటివ్ గా ఉంటే అంత సంతోషంగా ఉంటాడు? అన్నది గురు శిష్యుల మాట.
