సుకుమార్ స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ గా ఉంటుందా? హీరోలందరికి అదే ప్రాబ్లం...
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్య సినిమాతో దర్శకుడి గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సుకుమార్ మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ను సాధించాడు.
By: Gopi Velupala | 26 Sept 2026 6:00 PM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్య సినిమాతో దర్శకుడి గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సుకుమార్ మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ను సాధించాడు. ఈ మూవీ తో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఆయన నుంచి వచ్చే సినిమాల్లో స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అత్యద్భుతంగా స్క్రీన్ ప్లే రాయగలిగే దర్శకులలో సుకుమార్ కూడా ఒకరని చాలామంది అతని గురించి గొప్పగా చెబుతుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ హీరోల క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆర్య నుంచి పుష్ప సినిమా వరకు ప్రతి ఒక్కరి పాత్రలను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడు. అలాగే వాళ్ళ మెంటాలిటి ఆక్టివిటీ కూడా చాలా వెరైటీ గా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా 'ఆర్య ' సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ను తీసుకుంటే ఆ పాత్ర కొంచెం నెగెటివ్ షేడ్స్ లో ఉన్నట్టు గా అనిపిస్తుంది. కానీ తను ఇష్టపడ్డ అమ్మాయిని ఎంతలా ప్రేమిస్తున్నాడో దానిని వ్యక్త పరచడానికి ఆ పాత్ర ను అలా డిజైన్ చేశాడు. ఫీల్ మై లవ్ అంటూ ఆమె వెనుక తిరిగేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకున్నాడు. ఇక 'జగడం' సినిమాలో రామ్ క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. తనకు గల్లీ రౌడీ గ్యాంగ్ కి లీడర్ అవ్వాలని దానివల్ల తనకి ఒక ఐడెంటిటి వస్తుందని అనుకుంటాడు.
ఇక 'వన్ నేనొక్కడినే' సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ బాబు ఇమాజినేషన్ లో బతుకుతుంటాడు. దీని మీద ఈ సినిమా మొత్తం స్క్రీన్ ప్లే రాసుకుంటూ వచ్చాడు.'100% లవ్' సినిమాలో కూడా నాగ చైతన్య ఈగో ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు. రంగస్థలంలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో నటిస్తూనే తను ఏదైనా అనుకుంటే దాన్ని ఎలాగైనా సరే చేయగలిగే మొండితనంతో ముందుకు సాగుతాడు. చెవిటి వాడు అవ్వడం వల్లే వాళ్ల అన్నయ్యను చంపిన వ్యక్తులను పట్టుకోలేకపోయాడు. అది చివర్లో పట్టుకుంటాడు. దాన్ని బేస్ చేసుకొని సినిమా స్క్రీన్ ప్లే మొత్తం రాసుకున్నాడు. ఇక 'పుష్ప' సినిమాలో ఐడెంటిటి కోసం అల్లు అర్జున్ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే తన ఎడమ చేయి కొంచెం పైకి లేచి ఉంటుంది. ఆ క్యారెక్టర్ లో ఎంత పెయిన్ ఉందో ఆ చేయి ని చూస్తే మనకు అర్థమవుతుంది.
ఇలా సుకుమార్ తన హీరోల క్యారెక్టరైజేషన్ లో చాలా డిటైలింగ్ గా రాసుకుంటాడు. ఆ క్యారెక్టర్లతోనే సినిమా స్క్రీన్ ప్లే రాసుకుంటాడు. దాంతోనే ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి చూస్తుంటాడు. మొత్తానికైతే సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే సినిమా కూడా క్యారెక్టరైజేషన్ మీద బేస్ చేసుకుని రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకులందరిని మరోసారి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది...
