Begin typing your search above and press return to search.

దానయ్య X సుజీత్.. ఈ క్లారిటీతో ముగిసినట్లేనా?

అయితే దానయ్య, సుజీత్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

By:  M Prashanth   |   21 Oct 2025 4:28 PM IST
దానయ్య X సుజీత్.. ఈ క్లారిటీతో ముగిసినట్లేనా?
X

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ రీసెంట్ గా ఓజీ (They Call Him OG) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో తెరకెక్కించిన ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మాత డీవీవీ దానయ్య రూపొందించారు.




అయితే దానయ్య, సుజీత్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సినిమా ఆర్థిక అంశాల విషయంలో అభిప్రాయభేదాలు వచ్చినట్లు ఊహాగానాలు ఇప్పటికే ఉన్నాయి. బడ్జెట్‌ ఎక్కువ అవ్వడం పట్ల నిర్మాత దానయ్య దర్శకుడిపై అసంతృప్తిగా ఉన్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది.

జపనీస్ క్యాస్టింగ్ కోసం అనుకున్న దానికంటే రూ.కోటి బడ్జెట్ ఎక్కువగా అయిందని టాక్ వినిపించింది. దీంతో సుజీత్ తన వైపు నుంచి కొంత డబ్బులు చెల్లించారని వార్తలు వచ్చాయి. అవి కాస్త నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో సుజీత్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మంగళవారం స్పెషల్ నోట్ ను రిలీజ్ చేశారు.

" చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. కానీ సినిమాను ప్రారంభం నుంచి ముగింపు వరకు తీసుకెళ్లడానికి ఏమి అవసరమో చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. ఓజీ కోసం నా నిర్మాతతోపాటు ఆయన బృందం చూపించిన నమ్మకం, బలాన్ని మాటల్లో చెప్పలేము. అదే ఈ చిత్రానికి ఈ రోజు బలాన్ని ఇచ్చింది" అని సుజీత్ తెలిపారు.

"ఇది ఎవరికీ సులభం కాదు. కానీ ప్రతి ప్రయత్నం నిబద్ధత నుంచి వచ్చింది. ప్రక్రియను గౌరవిద్దాం. పవన్ కళ్యాణ్ గారు, ఓజీ పట్ల అభిమానులు చూపించిన ప్రేమ.. ఇవన్నీ అర్థవంతంగా అనిపిస్తాయి. దానయ్య గారు తన నిరంతర మద్దతుతో పాటు నమ్మకానికి కృతజ్ఞతలు. ప్రేమ, గౌరవం, కృతజ్ఞతతో మీ సుజీత్" అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం సుజీత్ స్పెషల్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు స్పందిస్తున్నారు. తమ మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదని సుజీత్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న వ్యాఖ్యలకు స్పష్టత ఇస్తూ.. దానయ్యపై తన అభిమానాన్ని చాటుకున్నారని అంటున్నారు. మరి దానయ్య ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.