Begin typing your search above and press return to search.

గుర్తు పెట్టుకోండి.. అతని పేరు సుజిత్..!

రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్న సుజిత్ నెక్స్ట్ సినిమానే ప్రభాస్ తో చేశాడంటే అందరు షాక్ అయ్యారు.

By:  Ramesh Boddu   |   25 Sept 2025 10:54 AM IST
గుర్తు పెట్టుకోండి.. అతని పేరు సుజిత్..!
X

రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్న సుజిత్ నెక్స్ట్ సినిమానే ప్రభాస్ తో చేశాడంటే అందరు షాక్ అయ్యారు. అది కూడా బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటో తెలిసిందే. ఆ టైం లో రెబల్ స్టార్ తో సాహో సినిమా తీసి సత్తా చాటాడు. సుజిత్ సాహో మన దగ్గర సరిగా వర్క్ అవుట్ కాలేదు కానీ బాలీవుడ్ లో ఆ సినిమా ఇంప్రెస్ చేసింది. సుజిత్ టేకింగ్ కి అందరు ఫిదా అయ్యారు. ఐతే సాహో తర్వాత ఒకటి రెండు ఛాన్స్ లు వచ్చినా చేయని అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేశాడు.

ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో..

ఓజీ సినిమాపై ముందు నుంచి ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. పవర్ స్టార్ తో సినిమా.. అందులోనూ భారీ అంచనాలు.. కేవలం రెండు సినిమాలు అనుభవం ఉన్న డైరెక్టర్. కానీ ఇవన్నీ పక్కన పెట్టి తన టేకింగ్ మీద దృష్టి పెట్టాడు డైరెక్టర్ సుజిత్. ఓజీ రిలీజైంది.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే సుజిత్ ని ఒక రేంజ్ లో మెచ్చుకుంటున్నారు. మా అభిమాన నటుడిని ఇంత బాగా చూపించిందినందుకు థాంక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సుజిత్ పవర్ స్టార్ కి వీరాభిమాని. అతను డైరెక్టర్ అయ్యి ఆ స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ టైం లో తనలో అభిమానిని కంట్రోల్ చేస్తూ తన డైరెక్షన్ తో ఫ్యాన్స్ ఎలా అయితే పవర్ స్టార్ ని స్క్రీన్ మీద చూడాలని అనుకుంటున్నారో అలా చూపించాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఓజీ ఒక ఫీస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

పవర్ స్టార్ మీద తనకెంత అభిమానం అన్నది..

ఆ లుక్, స్టైల్, వాక్, యాక్షన్ అన్నిటిలో సుజిత్ పవర్ స్టార్ మీద తనకెంత అభిమానం అన్నది చూపించాడు. ఇక సుజిత్ కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా తోడై.. తెర మీద పవన్.. తెర వెనక సుజిత్, థమన్ కలిసి వీర వాయించుడు వాయించారు. ఫైనల్ గా అవుట్ పుట్ చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. ఇది కదా మేము కోరుకునేది.. ఇది కదా మాకు కావాల్సింది అంటూ హంగామా చేస్తున్నారు.

ఓజీ సినిమా విషయంలో సుజిత్ స్టోరీ లైన్ పెద్దగా ఏమి లేకపోయినా పవర్ స్టార్ ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ఆయనకు ఇచ్చిన ఎలివేషన్స్ అయితే కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయేలా చేస్తుంది. స్టార్ ఛాన్స్ రాగానే వాళ్ల ఇమేజ్ ని మిస్ యూజ్ చేస్తూ ప్రాజెక్ట్ ని వేస్ట్ చేస్తుంటారు. కానీ సుజిత్ మాత్రం కాస్త టైం తీసుకున్నా కూడా ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక గొప్ప కానుక ఇచ్చాడు. దసరా పండగ వారం రోజులు ముందే థియేటర్లో తెచ్చేలా పవర్ స్టార్ ఫ్యాన్స్ సందడి ఉందంటే అది డైరెక్టర్ సుజిత్ పనితనం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.