OGలో పవన్ కు తక్కువ డైలాగ్స్.. సుజీత్ ఏమన్నారంటే?
ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుజీత్ స్పందించారు. సినిమా రిలీజ్ తర్వాత పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన.. పవన్ డైలాగ్స్ విషయంపై మాట్లాడారు.
By: M Prashanth | 27 Sept 2025 4:40 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఓజీ (They Call Him OG) ప్రపంచవ్యాప్తంగా ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. థియేటర్స్ కు మళ్లీ మళ్లీ వాళ్లను రప్పిస్తుందనే చెప్పాలి.
అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ కు అంతా ఫిదా అయ్యారు. వన్ మ్యాన్ షో అంటూ కొనియాడారు. ఆయన చేతిలో కటానా, నాంచాక్, గన్, కత్తి సహా అనేక ఆయుధాలు ఇమిడిపోయాయని చెప్పాలి. అయితే ఫస్టాఫ్ కంప్లీట్ అయ్యే వరకు పవన్ చెప్పిన డైలాగ్స్ ను మాత్రం వేళ్లపై కౌంట్ చేయవచ్చు. ఎప్పుడు డైలాగ్ చెబుతారని అంతా వెయిట్ చేశారు.
45 నిమిషాల వ్యవధిలో ఒక్క డైలాగ్ మాత్రమే చెబుతారు. దీంతో ఇప్పటికే ఆ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుండగా.. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుజీత్ స్పందించారు. సినిమా రిలీజ్ తర్వాత పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన.. పవన్ డైలాగ్స్ విషయంపై మాట్లాడారు.
సినిమాలో పవన్ కళ్యాణ్ కు కావాలని డైలాగ్స్ తగ్గించామని తెలిపారు సుజీత్. ఆయన రోల్ కు సినిమాలో ఎంత తక్కువ మాట్లాడితే.. అంత ఎఫెక్టివ్ గా ఉంటుందని అన్నారు. అందుకే కొన్నిసార్లు పవన్ రోల్ గురించి హీరోయిన్ ద్వారా చెప్పించాల్సి వచ్చినా అలా చేయలేదని చెప్పారు. ఒకవేళ అదే జరిగితే ఇంట్రెస్ట్ ఉండదని సుజీత్ అన్నారు.
ఏదేమైనా కొన్ని కారణాల వల్ల తమకు తెలియకుండానే పవన్ కు డైలాగ్స్ తగ్గిపోయాయని నవ్వుతూ చెప్పారు. ఇప్పుడు సుజీత్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే పవన్ కు డైలాగ్స్ తక్కువే ఉన్నా.. డబ్బింగ్ కు మాత్రం కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నారని తెలుస్తోంది. అనుకున్న కంటే ఎక్కువ రోజులే డబ్బింగ్ చెప్పారని టాక్.
మొత్తానికి కొన్నేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఓజీ ఇప్పుడు ఎట్టకేలకు విడుదలైందని చెప్పాలి. అప్పట్లో కాస్త షూటింగ్ నిర్వహించగా.. ఆ తర్వాత పవన్ ఏపీ రాజకీయాలతో బిజీగా మారడం వల్ల హోల్డ్ లోకి వెళ్లిపోయింది. ఇటీవల డేట్స్ కేటాయించడంతో సరైన ప్రణాళికతో చాలా తొందరగా షూటింగ్ ను పూర్తి చేశారు సుజీత్. ఇప్పుడు సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
