Begin typing your search above and press return to search.

సుజిత్ మాస్టర్ ప్లాన్.. నాని కోసం వెయిట్ చేస్తూనే!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్లలో ఒకటిగా మారిన నాని- సుజిత్ ప్రాజెక్ట్ బ్లడీ రోమియో అనూహ్యంగా ఆలస్యమవుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 May 2026 1:13 PM IST
సుజిత్ మాస్టర్ ప్లాన్.. నాని కోసం వెయిట్ చేస్తూనే!
X

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్లలో ఒకటిగా మారిన నాని- సుజిత్ ప్రాజెక్ట్ బ్లడీ రోమియో అనూహ్యంగా ఆలస్యమవుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా, నాని ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ షూటింగ్ షెడ్యూల్స్ మారిపోవడంతో బ్లడీ రోమియో ప్లానింగ్ మొత్తం వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కారణంగా డైరెక్ట‌ర్ సుజిత్ తన ఖాళీ టైమ్ ను మరో భారీ ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించినట్టు సమాచారం.

ప్రస్తుతం నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అత్యంత జాగ్రత్తగా పని చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత విస్తరించాయట. మొదట ఈ సినిమాను మార్చి రిలీజ్‌కు ప్లాన్ చేసినప్పటికీ తర్వాత ఆగస్టుకు వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కూడా మారే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే ది ప్యారడైజ్ ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ‌య్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈ ఆలస్య ప్రభావం నేరుగా బ్లడీ రోమియోపై పడిందని తెలుస్తోంది.

సుజిత్ ఇప్పటికే బ్లడీ రోమియో కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టినప్పటికీ, నాని డేట్స్ ఫైనల్ కాకపోవడంతో షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతున్న‌ట్టు సమాచారం. అయితే ఈ గ్యాప్‌ను వృథా చేయకుండా సుజిత్, మరో ఆసక్తికరమైన పనిలో బిజీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అదే ఓజి పార్ట్2 స్క్రిప్ట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన ఓజి సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. సినిమా రిలీజ్ కు ముందే దానికి సీక్వెల్ ఉంటుందని టాక్ రావడం అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఇప్పుడు సుజిత్ తన టైమ్ ను పూర్తిగా ఓజి2 కథను మరింత ప‌క‌డ్భందీగా తయారు చేయడానికి వినియోగిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఓజి2 కోసం సుజిత్ ఇప్పటికే కొన్ని కీలక ఐడియాలను లాక్ చేసినట్టు టాక్. మొదటి భాగానికి మించి స్కేల్, యాక్షన్, ఎమోషన్ ఉండేలా స్క్రిప్ట్‌ను డిజైన్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ సినిమా వెంటనే పట్టాలెక్కే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ముందుగా నాని- సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న బ్లడీ రోమియో పూర్తవ్వాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఆయ‌న డేట్స్ కూడా కీలక అంశంగా మారాయి. దీంతో ఓజి2 స్క్రిప్ట్ వ‌ర్క్ మొద‌లైనా, సినిమా సెట్స్‌పైకి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్‌లపై సుజిత్ చేస్తున్న ప్లానింగ్ మాత్రం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.