జస్ట్ ఇమాజిన్.. ఓకే స్క్రీన్ పై ప్రభాస్, పవన్ కళ్యాణ్ కనిపిస్తే..?
రన్ రాజా రన్ లాంటి మీడియం రేంజ్ సినిమా తీసి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ సుజీత్ తన నెక్స్ట్ సినిమానే బాహుబలి ప్రభాస్ తో చేశాడంటే అతని గట్స్ ని మెచ్చుకోవాల్సిందే.
By: Ramesh Boddu | 26 Oct 2025 3:00 PM ISTరన్ రాజా రన్ లాంటి మీడియం రేంజ్ సినిమా తీసి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ సుజీత్ తన నెక్స్ట్ సినిమానే బాహుబలి ప్రభాస్ తో చేశాడంటే అతని గట్స్ ని మెచ్చుకోవాల్సిందే. బాహుబలి తర్వాత సాహో సినిమా తీసి రెబల్ ఫ్యాన్స్ ని మెప్పించిన సుజీత్ ఆ సినిమా తర్వాత దాదాపు నాలుగైదేళ్లు గ్యాప్ తీసుకుని ఓజీ చేశాడు. సాహో తర్వాత సుజీత్ కి కొన్ని రీమేక్ ఛాన్స్ లు వచ్చినా కూడా అవి చేయడం ఇష్టం లేక తప్పుకున్నాడు. ఐతే పవన్ కళ్యాణ్ ఓజీతో సుజీత్ రేంజ్ పెరిగిపోయింది.
సుజీత్ ఓజీ ప్రీక్వెల్ లో ప్రభాస్..
పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ విజువల్ ట్రీట్ ఇస్తూ ఓజీ తీసిన సుజీత్ సినిమాతో తన ఇంపాక్ట్ ఏంటో చూపించాడు. అంతేకాదు ఈ సినిమాతో తన సినిమాటిక్ యూనివర్స్ ని అనౌన్స్ చేశాడు. సినిమాలో సాహో చిన్నప్పటి సీన్ చూపించాడు సుజీత్. సో ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది. ఐతే ఓజీ ప్రీక్వెల్ చేయాలంటే ప్రభాస్ ని ఒప్పించాలి. సాహో తీశాడు కాబట్టి ప్రభాస్ కి కథ నచ్చితే చేసే ఛాన్స్ ఉంది. కానీ ఆయన లైనప్ చూస్తే బాబోయ్ అనిపించేస్తుంది.
మరోపక్క పవన్ కళ్యాణ్ ఓజీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లు పాలిటిక్స్ లో బిజీ అవ్వాలని అనుకుంటున్నారు. ఓజీ సీక్వెల్ కథ రెడీ చేసి పవన్ కళ్యాణ్ ని కలవాలని అనుకుంటున్నాడు సుజీత్. ఐతే ఈలోగా ఓజీ తర్వాత నానితో సుజీత్ సినిమా ఉంది. బ్లడీ రోమియో టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ టార్గెట్ తో వస్తుంది.
ప్రభాస్, పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పవర్ హౌస్..
ఐతే ఆ సినిమా తర్వాత సుజీత్ ఓజీ ప్రీక్వెల్ లేదా సీక్వెల్ చేస్తాడా లేదా మరో హీరోతో కొత్త కథ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే ఓజీ ప్రీక్వెల్ చేస్తే అందులో సాహో ప్రభాస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తారన్నమాట. అది జరుగుతుందా లేదా అన్నది తెలియదు కానీ సుజీత్ ప్లానింగ్ మాత్రం చాలా భారీగానే ఉందనిపిస్తుంది.
ప్రభాస్, పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పవర్ హౌస్ లాంటి ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. పవన్, ప్రభాస్ కాంబో సినిమా వస్తే మాత్రం తెలుగు రెండు రాష్ట్రాల్లో కాదు బాలీవుడ్ సైతం షేక్ అవుతుందని చెప్పొచ్చు. సుజీత్ ఎలా ప్లాన్ చేస్తాడు.. ఎప్పుడు ప్లాన్ చేస్తాడన్నది తెలియదు కానీ పవన్, ప్రభాస్ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆల్రెడీ వేరే ఇండస్ట్రీలో ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తూ అదరగొట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్, పవన్ కలిసి మన దగ్గర బాక్సాఫీస్ బీభత్సాన్ని సృష్టించడం పక్కా అని చెప్పొచ్చు.
