Begin typing your search above and press return to search.

నాని మూవీ యూనివర్స్ లో భాగమా? సుజీత్ ఏమన్నారంటే?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ రీసెంట్ గా ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   26 Sept 2025 8:26 PM IST
నాని మూవీ యూనివర్స్ లో భాగమా? సుజీత్ ఏమన్నారంటే?
X

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ రీసెంట్ గా ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు, సినీ ప్రియులు ఎదురు చూడగా.. గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజైంది. ప్రీమియర్స్‌ తో సందడి బుధవారం రాత్రి మొదలైంది. ఇప్పుడు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.

అదే సమయంలో గుర్తుపెట్టుకోండి.. ఇది ఆరంభం మాత్రమేనని సుజీత్ ఇటీవల పోస్ట్ పెట్టారు. అన్నీ సెట్‌ అయితే ఓజీ వరల్డ్.. మరింత పెద్దదవుతుందని స్పెషల్ గా చెప్పారు. అంతే కాదు Storming in Cinemas near U (మీ దగ్గర్లోని థియేటర్లలో తుపాను) అంటూ SCUలను హైలైట్‌ చేయడంతో సినిమాటిక్‌ యూనివర్స్‌ ప్లాన్‌ చేశారంటూ అంతా ఫిక్స్ అయ్యారు.

ఆ తర్వాత సినిమాలో తన గత మూవీ సాహోను లింక్ పెట్టడంతో మళ్లీ ఫిక్స్ అయిపోయారు. దీంతో ప్రభాస్, పవన్ కాంబోలో మూవీ ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో సుజీత్.. నెక్స్ట్ నేచురల్ స్టార్ నానితో బ్లడీ రోమియో మూవీకి గాను వర్క్ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు.

నాని ప్యారడైజ్ మూవీని పూర్తి చేశాక.. తన సినిమాను స్టార్ట్ చేయనున్నారు. అయితే ఆ మూవీ కూడా యూనివర్స్ లో భాగమేనని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సినిమాటిక్ యూనివర్స్ హైప్ ను తాను క్యాష్ చేసుకోవాలని అనుకోవడం లేదని తెలిపారు.

తాను క్యూరియాసిటీతో సాహోను యాడ్ చేశానని తెలిపారు. సాహో, ఓజీ కనెక్ట్ అయితే ఏంటి అన్నట్లు యాడ్ చేశానని తెలిపారు. ఇప్పుడు బ్లడీ రోమియో విషయంలో కూడా అంతేనని అన్నారు. షూటింగ్ చేస్తున్నప్పుడు తనకు అలా అనిపిస్తే, తాను దానిని యాడ్ చేస్తానని వెల్లడించారు. కాలమే సమాధానం చెబుతుందని అన్నారు.

మరో ఇంటర్వ్యూలో యాక్షన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కామెడీ జోనర్ ను మిస్ అవుతున్నట్లు తెలిపారు. అన్ని జోనర్స్ లో సినిమాలు చేస్తానని అన్నారు. దీంతో నాని మూవీ డార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.