Begin typing your search above and press return to search.

సుజీత్ నెక్స్ట్.. నానితో ఆ జోనర్ లో చేయనున్నారా?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   26 Sept 2025 3:13 PM IST
సుజీత్ నెక్స్ట్.. నానితో ఆ జోనర్ లో చేయనున్నారా?
X

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ డ్రామాగా సినిమాను రూపొందించిన సుజీత్.. ఫ్యాన్స్ ఎలా కోరుకున్నారో అంతకుమించి పవన్ ను చూపించారు. వరల్డ్ వైడ్ గా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

అయితే ఇంకాస్త స్క్రిప్ట్ పై పని చేసుంటే బాగుండేదని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు మూడు సినిమాలు సుజీత్ తీయగా.. అందులో రెండు సీరియస్ యాక్షన్ జోనర్ లోనే ఉన్నాయి. ఎక్కువగా యాక్షన్ జోనర్‌ కే తొలి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కామెడీని సుజీత్ మిస్ అవుతున్నారట.

ఆ విషయాన్ని ఆయనే తెలిపారు. ఓజీ పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న సుజీత్.. ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో యాక్షన్ అనేది తన బ్లడ్ లోనే ఉందని, అందుకే ఆ ఎలిమెంట్ తప్పక కనిపిస్తుందని తెలిపారు. కానీ కామెడీ మిస్ అవుతున్నట్లు చెప్పుకొచ్చారు.

అందుకే భవిష్యత్తులో విభిన్నమైన జోనర్స్‌ లో తీస్తానని తెలిపారు. దీంతో సుజీత్.. తన అప్ కమింగ్ మూవీ డార్క్ కామెడీ జోనర్ లో ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే తన తదుపరి చిత్రం వచ్చే ఏడాది ఎటువంటి ఆలస్యం లేకుండా విడుదల అవుతుందని హామీ ఇచ్చారు సుజీత్. నేచురల్ స్టార్ నానితో వర్క్ చేస్తున్నట్లు తెలిపారు.

ఆ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ అనుకుంటున్నట్టు, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలిపారు. ఆ మూవీ షూటింగ్ చాలా కష్టమని, అది వేరే రకమైన ఎడిటింగ్ ప్యాటర్న్, మ్యూజిక్‌ తో కూడిన ప్రయోగాత్మక చిత్రంగా చెప్పారు. ఎక్కువ భాగం షూటింగ్.. యూరప్‌ లో జరిగే ఒకే షెడ్యూల్‌ తో ముగుస్తుందని తెలిపారు.

ది ప్యారడైజ్ సినిమాను నాని పూర్తి చేసిన తర్వాత తన సినిమా షూట్ ప్రారంభమవుతుందని అన్నారు. దీంతో సుజీత్ గత చిత్రాల్లో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా చూపించగా.. ఇప్పుడు కాస్త కొత్తగా తీయనున్నట్లు అర్థమవుతోంది. సుజీత్ మిస్ అవుతున్నట్లు చెప్పిన కామెడీ అంశాలు నాని సినిమాలో ఉంటాయని అంతా అంచనా వేస్తున్నారు. సరైన యాక్షన్ అంశాలతో కూడిన చమత్కారమైన డార్క్ కామెడీ ఎంటర్టైనర్‌ గా ఉండబోతోందని వినికిడి.